కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు.శివుని (Lord Shiva) ఫోటో చూపిస్తూ.. తమని తాము 24 గంటలపాటు హిందువులమని చెప్పుకునే వారిలో హింస, ద్వేషం, అసత్యం కురుకుపోయి ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.హిందూ మతం పేరు చెప్పి బీజేపీ (BJP) అందరినీ భయపెడుతోందని ఆరోపణలు చేశారు. అసలు హింసని ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలమని ప్రశ్నించారు.తాను కేవలం ప్రధాని మోదీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ని ఆ వ్యాఖ్యలు చేశానని.. మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. మోదీ హిందూ స‌మాజం కాదని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు, ప్రధాని మోదీ ఏమన్నారంటే..

రాహుల్ గాంధీ శివుని విగ్రహం చూపించడంపై కూడా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభలో ప్లకార్డ్‌లు, ఫొటోలు ప్రదర్శించడం నిషేధం అని తేల్చి చెప్పారు. ఇందుకు రాహుల్ బదులిస్తూ.. ఈ సభలో శివుని బొమ్మని చూపించడం నిషేధమా? అని పదే పదే ప్రశ్నించారు. తన మెడకు పాము చుట్టిముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. ఒకవేళ హింసకి ప్రతీక అయితే.. ఆ త్రిశూలం కుడిచేతిలో ఉండేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)