LPG Price Hike: ఈ సారి ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.15 పెంపు, పెరిగిన ధరతో 14.2 కేజీల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.899, కొనసాగుతున్న పెట్రో ధరల పెంపు
గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ (LPG Price Hike) పెరిగింది. ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.15 (Domestic Cylinders Price Increased by Rs 15) పెంచారు. పెట్రోలియం కంపెనీలు ధరను పెంచినట్లు తెలుస్తోంది. పెరిగిన ధరతో 14.2 కేజీల నాన్ సబ్సిడీ సిలిండర్ ఢిల్లీలో రూ.899కి వస్తోంది.
New Delhi, October 6: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ (LPG Price Hike) పెరిగింది. ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.15 (Domestic Cylinders Price Increased by Rs 15) పెంచారు. పెట్రోలియం కంపెనీలు ధరను పెంచినట్లు తెలుస్తోంది. పెరిగిన ధరతో 14.2 కేజీల నాన్ సబ్సిడీ సిలిండర్ ఢిల్లీలో రూ.899కి వస్తోంది. ఇక 5 కేజీల సిలిండర్ ఇప్పుడు రూ.502కు లభిస్తుంది. ఇవాళ్టి నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఢిల్లీలో ఈ రేటు వర్తిస్తుంది. ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేర పైకి కదిలింది. దీని కన్నా ముందు ఆగస్ట్ 17న సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఇకపోతే ముంబైలో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.899.5కు చేరింది. బెంగళూరులో సిలిండర్ ధర రూ.887.5కు ఎగసింది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.950కి పైకి చేరింది. ఏపీలో కూడా సిలిండర్ ధర రూ.960 వద్ద ఉంది.
ఇక పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలను పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు.. మరోమారు వినియోగదారులపై భారం మోపాయి. తాజాగా పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 102.94కు చేరగా.. డీజిల్ ధర రూ.91.42కు పెరిగింది. అలాగే ముంబైలో పెట్రోల్ ధర రూ.108.96కు ఎగబాకగా, డీజిల్ ధర రూ.99.17కి చేరుకుంది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.107.08కి పెరగగా, డీజిల్ ధర రూ.99.75కు చేరింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్ రూ.103.65, డీజిల్ రూ.94.53, చెన్నైలో పెట్రోల్ రూ.100.49, డీజిల్ రూ.95.93కు చేరింది.