Coronavirus in TS (Photo Credits: IANS)

New Delhi, October 6: దేశంలో కొత్తగా 18,833 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,71,881కి (Coronavirus in India) చేరింది. ఇందులో 3,31,75,656 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,49,538 మంది మృతిచెందారు. మరో 2,46,687 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, 203 రోజుల తర్వాత ఇంత తక్కువకు చేరుకున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక గత 24 గంటల్లో కొత్తగా 24,770 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. మరో 278 మంది మృతిచెందారు. కాగా, దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 5 నాటికి 57,68,03,867 నమూనాలకు కరోనా పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి తెలిపింది. ఇందులో మంగళవారం ఒక్కరోజే 14,09,825 మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.

కరోనా మహమ్మారి ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, కానీ దాన్నుంచి ఇంకా బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గత వారం 31 లక్షల మందికి కరోనా సోకిందని, 54 వేల మరణాల సంభవించాయని వెల్లడించింది. వాస్తవంగా ఆ లెక్కలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది. మనకు వైరస్‌పై నియంత్రణ రాలేదు కాబట్టే.. ఈ ముప్పు కొనసాగుతోంది. మహమ్మారికి చరమగీతం పాడేందుకు మనవద్ద ఉన్న సాధనాలను సరిగా వినియోగించుకోవడంలేదు. కొన్ని ప్రాంతాల్లో ఐసీయూలు, ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముగిసిపోయిందని నటిస్తూ, తిరిగేస్తున్నారు’ అని ఆరోగ్య సంస్థకు చెందిన మారియా వ్యాన్ కెర్కోవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌కు రెండు దేశాల నుంచి ముప్పు, మేము రెడీగా ఉన్నామని తెలిపిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మూడు స్థావారాల్లో వైమానిక బలగాలను మోహరించిందని వెల్లడి

దాదాపు రెండేళ్ల కాలంలో సుమారు 50 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనా టీకా తీసుకోని వ్యక్తుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని మారియా వెల్లడించారు. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాల రేటు.. టీకా తీసుకోని వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కరోనా వైరస్, టీకా గురించి నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న తప్పుడు సమాచారం తీవ్ర ప్రభావం చూపుతోందని అసహనం వ్యక్తం చేశారు. అది ప్రజల మరణాలకు కారణమవుతోందని వాపోయారు. అలాగే అంతర్జాతీయ సమాజం వైరస్‌పై వీలైనంత ఎదురుదాడి చేయలేదని గుర్తు చేశారు.