Madhya Pradesh: ప్రసాదం ఇచ్చి భక్తురాలిపై దొంగ స్వామీజి అత్యాచారం, తరువాత ఆ దేవతే నీపై అత్యాచారం చేసిందని వెల్లడి, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి (Raping Devotee In Bhopal) పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.

mirchi-baba-Swami-Vairagyanand-Giri (Photo-Twitter/Mirchi Baba)

Bhopal, August 9: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. స్వామీజి పేరుతో భక్తురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ సెల్ప్ దేవుడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..రాష్ట్రంలో ఒక వ్యక్తి (Swami Vairagyanand Giri) తనను దేవుడిగా ప్రకటించుకుని స్వామి వైర్యాగ్యనంద గిరిగా (Self-Styled Godman Swami Vairagyanand Giri) పబ్లిక్‌లో చెలామణి అవుతున్నాడు. ఈ మేరకు ఒక మహిళ తనకు చాలా ఏళ్లుగా పిల్లలు కలగకపోవడంతో ఈ వైర్యాగ్యనంద స్వామిని కలిసినట్లు పోలీసులుకు తెలిపింది.

అయితే కొన్ని పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని నమ్మబలికి ఆ భక్తురాలికి ఒక ప్రసాదం ఇచ్చాడని చెప్పింది.ఆ ప్రసాదం తిన్న మహిళ వెంటనే సృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి (Raping Devotee In Bhopal) పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఐతే తనకు మెలుకువ వచ్చిన తర్వాత ఆ వైరాగ్యానంద స్వామీ.. దేవత నీపై అత్యాచారం చేసిందని చెబుతున్నాడని ఆమె పోలీసుల ఎదుట వాపోయింది.

డబ్బులు ఇస్తానంటూ రూంకి పిలిచి అత్యాచారం, అనంతరం తన ఫ్రెండ్‌తో పడుకుంటే రూ.5 వేలు ఇస్తానని షరతు, పోలీసులను ఆశ్రయించిన జూనియర్ ఆర్టిస్ట్

అయితే ఆ స్వామిజీకి రాజకీయ పార్టీల అండదండలు ఉండటంతో బాధిత మహిళ వెంటనే ఆ స్వామీజీ పై ఫిర్యాదు చేయలేకపోయింది.చివరకు ధైర్యం తెచ్చుకుని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు (Swami Vairagyanand Giri Arrested) చేసినట్లు వెల్లడించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్దతుగా నిలబడటమే కాకుండా ఒక సీనియర్‌ నాయకుడి గెలుపు కోసం ఈయన యజ్ఞం చేశాడు. పైగా అతను గెలవకపోతే సమాదిలోకి వెళ్లిపోతానంటూ ప్రగల్పాలు కూడా పలికాడు.