MP Shocker: శాడిస్ట్ భర్త, తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని భార్య ప్రైవేట్ పార్టులో ఫెవిక్‌విక్‌ పెట్టి పైశాచికానందం, మంటతో విలవిలలాడిన బాధితురాలు

ఓ శాడిస్ట్ భర్త భార్య చేతులు, కాళ్ళను ముందుకు కట్టి క్రూరుడిగా మారాడు. అనంతరం భార్య ప్రైవేట్ పార్ట్‌లో ఫెవిక్‌విక్‌ని పెట్టాడు.

Representational Image | (Photo Credits: IANS)

Bhopal, Sep 15: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ శాడిస్ట్ భర్త భార్య చేతులు, కాళ్ళను ముందుకు కట్టి క్రూరుడిగా మారాడు. అనంతరం భార్య ప్రైవేట్ పార్ట్‌లో ఫెవిక్‌విక్‌ని పెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లోని కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌లో ఒక హేయమైన సంఘటన తెరపైకి వచ్చింది.

భార్య దుస్తులు మొత్తం పీకేసిన భర్త ఫెవిక్‌విక్‌ తీసుకుని భార్య ప్రైవేట్ పార్ట్ లో పోసి గట్టిగా అదిమేశాడు.మంటలు తట్టుకోలేక భార్య గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు వెళ్లి మహిళను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.విచారణలో డ్రగ్స్‌కు బానిసైన ఆ వ్యక్తి మత్తులో ఉండేందుకు గాను భార్య వద్ద తరచూ డబ్బులు అడిగేవాడని తేలింది.

దారుణం, కూతురికి మళ్లీ పెళ్లి చేశాడని తండ్రి ముక్కు చెవులు కోసిన మాజీ అత్తింటివారు, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య బాధితుడు

కొంతకాలంగా రాథోడ్ డ్రగ్స్ సేవించడానికి బానిస అయ్యాడని, డ్రగ్స్ సేవించడానికి డబ్బులు ఇవ్వకుంటే భార్యను చితకబాదేవాడని స్థానికులు చెప్పారని పోలీసులు అన్నారు. ఆమె డబ్బుల్లేవని చెప్పడంతో ఈ అకృత్యానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్తున్నారు.అతని కోసం గాలిస్తున్నామని కోత్వాల్ పోలీసులు తెలిపారు.