Man Flees With Test Ride Bike: టెస్ట్ రైడ్ కోసం వ‌చ్చి బైక్ తో ఉడాయించిన వ్య‌క్తి, అలా వెళ్లి వ‌స్తాన‌ని చెప్పి రేసింగ్ బైక్ తో పారిపోయిన టీ షాప్ న‌డిపే వ్య‌క్తి

టీ అమ్మే వ్యక్తిని వెంట తీసుకెళ్లి తండ్రిగా పరిచయం చేశాడు. టెస్ట్‌ రైడ్‌ కోసమంటూ కీస్‌ తీసుకుని బైక్‌తో పారిపోయాడు. (Man flees with Bike) ఎంతకీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు షోరూమ్ యజమాని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

Man Flees With Test Ride Bike (PIC@ X)

Agra, NOV 07: రేసింగ్ బైక్‌ కొనేందుకు ఒక వ్యక్తి షోరూమ్‌కు వెళ్లాడు. టీ అమ్మే వ్యక్తిని వెంట తీసుకెళ్లి తండ్రిగా పరిచయం చేశాడు. టెస్ట్‌ రైడ్‌ కోసమంటూ కీస్‌ తీసుకుని బైక్‌తో పారిపోయాడు. (Man flees with Bike) ఎంతకీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు షోరూమ్ యజమాని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. సాహిల్‌కు రేసింగ్‌ బైక్‌ అంటే ఎంతో ఇష్టం. అయితే దానిని కొనే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఎలాగైనా ఆ బైక్‌ పొందాలని భావించాడు. నవంబర్ 3న ఒక షోరూమ్‌ వద్దకు వెళ్లాడు. సెకండ్ హ్యాండ్ రేసింగ్ బైక్‌ను లక్షకు కొనేందుకు ఒప్పందం చేసుకున్నాడు. తండ్రితో కలిసి వచ్చి డబ్బులు ఇచ్చి బైక్‌ తీసుకుంటానని చెప్పాడు. కాగా, కొంత సేపటి తర్వాత వృద్ధుడైన ఒక వ్యక్తితో కలిసి ఆ షోరూమ్‌కు సాహిల్‌ వెళ్లాడు. ఆ వ్యక్తిని తన తండ్రిగా పరిచయం చేశాడు. టెస్ట్‌ రైడ్‌ పేరుతో బైక్‌ కీ తీసుకున్నాడు. దానిని నడుపుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, క్రేన్‌ నుంచి పట్టుజారి బైక్‌పై వెళ్తున్న పోలీస్‌ మీద పడిన దిమ్మె, అక్కడికక్కడే మృతి 

మరోవైపు సాహిల్ (Shahil) ఎంతకీ తిరిగి రాకపోవడంతో షోరూమ్‌ యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ వృద్ధుడ్ని ఆరా తీయగా సాహిల్‌ గురించి తనకు తెలియదని చెప్పాడు. టీ తాగేందుకు రోజూ తన టీస్టాల్‌కు వస్తాడని అన్నాడు. ముఖ్యమైన పని ఉందంటూ తనను అక్కడకు తీసుకువచ్చాడని చెప్పాడు.

కాగా, ఇది విన్న షోరూమ్ ఓనర్‌ కంగుతిన్నాడు. బైక్‌తో పారిపోయిన సాహిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నవంబర్‌ 5న అతడ్ని అరెస్ట్‌ చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే రేసింగ్‌ బైక్‌ అంటే తనకు ఇష్టమని, కొనే స్థోమత లేకపోవడంతో ఇలా ప్లాన్‌ చేసి చోరీ చేసినట్లు పోలీసులకు అతడు చెప్పాడు.



సంబంధిత వార్తలు