COVID-19 : కరోనా నియంత్రణపై రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు, సముద్రంలో దొరికే నాచుతో కోవిడ్-19కి చెక్, రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వెల్లడి

కోవిడ్-19 (COVID-19) దెబ్బకు దేశాలకు దేశాలే లాక్‌డౌన్ (Lockdown) లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నారు.

Coronavirus Global Report Nearly 1 lakh new corona cases in 24 hours globally, US leads (Photo-PTI)

New Delhi, April 13: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ (coronavirus) మహమ్మారికి మందు రావడానికి ఆరు నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన సంగతి విదితమే.ఈ వైరస్ నియంత్రణకు ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడంతో ఇది ప్రపంచ దేశాలను (Global Coronavirus) అల్లకల్లోలం చేస్తోంది. కోవిడ్-19 (COVID-19) దెబ్బకు దేశాలకు దేశాలే లాక్‌డౌన్ (Lockdown) లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నారు.

కరోనా పని పట్టాలంటే 18 నెలలు ఆగాల్సిందే

ఈ క్రమంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైంటిస్టుల పరిశోధన (Reliance researchers) ఆసక్తికరంగా మారింది. కరోనావైరస్ వ్యాప్తిని సముద్రంలో దొరికే ఓ రకమైన ఎరుపు రంగు నాచు (మెరైన్ రెడ్ ఆల్గే) తో అరికట్టవచ్చని వారు చెబుతున్నారు. సముద్రంలో దొరికే నాచు నుంచి తయారుచేసిన జీవరసాయన పొడి యాంటీ-వైరల్ ఏజెంట్ గా పని చేస్తుందని వెల్లడించారు. వృక్షజాలం, జంతుజాలం, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఎత్తైన మొక్కలులాంటి సహజ వనరుల నుండి ఉత్పన్నమైన ఉత్పత్తులు ఇలాంటి వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులతో పోరాడటానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

అసలైన సవాల్ ఇదే, సేఫ్‌హ్యాండ్స్ ఛాలెంజ్‌ని విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు (Marine red algae) నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాచురైడ్‌లు, కరోనా వైరస్ నిరోధానికి ప్రధానంగా పనిచేస్తాయని రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వినోద్ నాగ్లే, మహాదేవ్ గైక్వాడ్, యోగేశ్ పవార్, సంతను దాస్‌గుప్తా బృందం తెలిపింది. తాజా పరిశోధనల ప్రకారం శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లను ఇవి అడ్డుకుంటాయని తమ పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు.

కరోనావైరస్‌ను ఇండియా తరిమేస్తుంది

వైరస్‌ని నిరోధించడానికి ఇవి బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా ఇవి పనిచేస్తాయన్నారు. అంతేకాదు కరోనా యాంటీ వైరల్ మందులు మాత్రమే కాకుండా శానిటరైజ్ వస్తువులపై వైరస్ చేరకుండా కోటింగ్ (పై పూతగా)గా కూడా వాడవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడంలో పోర్ఫిరీడియంతో సహా వివిధ జీవ వనరులనుంచి లభ్యమయ్యే క్యారేజీనన్ పాత్ర ప్రశంసనీయమని తేల్చారు. తమ పరిశోధనకు మద్దతుగా క్లినికల్ ట్రయల్ అధ్యయనాలలో క్యారేజీనన్, సల్ఫేట్ పాలిసాకరైడ్ పాటు పోర్ఫిరిడియం ఇపిఎస్‌ను కూడా వినియోగించవచ్చని తెలిపారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలకు సంబంధించిన మల్టీడిసిప్లినరీ ప్రిప్రింట్ ప్లాట్‌ఫామ్ ప్రిప్రింట్స్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ నెల ప్రారంభంలో ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో కరోనాపై రిలయన్స్ లైఫ్ సైన్సెస్ చేస్తున్న పరిశోధనల గురించి ప్రస్తావించిన సంగతి విదితమే.



సంబంధిత వార్తలు