Delhi Gang Rape: నాపై జైలులో పలుమార్లు అత్యాచారం, సహకరించిన తీహార్ జైలు అధికారులు, నిందితుడు ముఖేష్ సింగ్ సంచలన ఆరోపణలు, ఫిబ్రవరి 1న ఉరితీయాలన్న ఢిల్లీ హైకోర్టు

ఈ కేసు నుంచి బయటపడేందుకు అన్ని దారులను ఉపయోగించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏకంగా తనపై పలుమార్లు జైలులో అత్యాచారం(sexually abused) చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

File image of Mukesh Singh (Photo Credits: IANS)

New Delhi, January 28: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషుల్లో ఒకడైన ముఖేష్‌ సింగ్‌ (Mukesh Singh) సంచలన ఆరోపణలు చేశాడు. ఉరి శిక్షను తప్పించుకునేందుకు అన్ని దారులను ఉపయోగించుకుంటున్నాడు.  ఈ క్రమంలోనే ఏకంగా  జైలులో  తనను పలుమార్లు లైంగిక వేధింపులకు (sexually abuse) గురి చేశారంటూ కొత్త వాదనకు తెరతీశాడు.

సర్వోన్నత న్యాయస్థానంలో (Supreme Court) ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఈ విషయాలను వెల్లడించాడు. తీహార్‌ జైల్లో ( (Tihar jail) సహ దోషి అక్షయ్‌ సింగ్‌ తనపై పలుమార్లు ఆత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపాడు. దీనికి జైలు అధికారులు సహకరించారని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.

క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంపై ముఖేష్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.

విచారణ సందర్భంగా న్యాయస్థానం ముందు ముఖేష్‌ సింగ్‌ సంచలన విషయాలను వెల్లడించాడు. తీహార్‌ జైల్లో తననై లైంగిక దాడి జరిగిందని, జైల్లో శిక్ష అనుభవిస్తున్న సహ దోషి అక్షయ్‌ సింగ్‌ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని న్యాయస్థానంలో పేర్కొన్నాడు. పైగా దీనికి  అతీహార్‌ జైలుధికారుల సహకారించారని ఆరోపణలు చేశాడు.

నిర్భయ దోషుల ఉరిశిక్ష దృశ్యాలు లైవ్

రాష్ట్రపతికి (President Ram Nath Kovind) పెట్టిన క్షమాభిక్ష పిటిషన్‌లో ఈ విషయాలు వెల్లడించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని న్యాయస్థానం ముందు వాపోయాడు. ఈ మేరకు ముఖేష్‌ సింగ్‌ తరఫున న్యాయవాది అంజనా ప్రకాశ్‌ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అయితే క్షమాభిక్ష పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వులో పెట్టింది. బుధవారం దీనిపై తుది తీర్పును వెల్లడించనుంది.

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి ఖరారయ్యింది. ఫిబ్రవరి 1న ఉదయం 6గంటలకు ఉరి తీయ్యాలంటూ ఢిల్లీ హైకోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ దోషులను ఈ నెల 22న ఉరి శిక్ష విధిస్తూ పటియాల కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌తో వీరి ఉరిశిక్ష ఆలస్యమైంది.

రాష్ట్రపతి, క్షమాభిక్షను తిరస్కరించడంతో వీరికి ఉరి శిక్ష అమలుకు అడ్డంకులు తొలగాయి. దీంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించనున్నారు. 2012లో నిర్భయపై (Delhi gangrape and murder case)  ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారంచేసి ఆమె మరణానికి కారణమయ్యారు.

కాగా దోషులను ఉరి తీసేందుకు తీహార్‌జైలు అధికారులు మరోసారి ట్రయల్స్‌ నిర్వహించారు. అయితే ఫిబ్రవరి 1న దోషులను ఉరితీస్తారా? లేదా అనేదానిపై తీవ్ర ఉత్కఠ నెలకొంది. తాజా పరిణామాలపై నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికే దోషులు ఇలా నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Manmohan Singh Last Rites On Saturday: శనివారం మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు.. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకం సగానికి అవనతం

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు