New Delhi, December 13: నిర్భయ దోషులకు (Nirbhaya Rape Case) త్వరగా డెత్ వారెంట్ (death warrant)జారీ చేసి ఉరితీయాలన్న నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్‌పై(petition) పటియాలా కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ -18,2019కి ఢిల్లీ కోర్టు (Delhi Court) వాయిదా వేసింది. బుధవారం(డిసెంబర్-18,2019)మధ్యాహ్నాం 2గంటలకు ఈ పిటిషన్ పై విచారణ చేయనున్నట్లు అడిషినల్ సెషన్ జడ్జి సతీష్ కుమార్ అరోరా (Additional Session Judge Satish Kumar Arora) తెలిపారు. కాగా నిర్భయ కేసు (Nirbhaya Case)లో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను వెంటనే ఉరితీసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. నిర్భయ దోషి చావు తెలివితేటలు ఎలా ఉన్నాయో చూడండి
నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినందువల్ల అది డిసెంబర్ 17న విచారణ రానుందని అప్పటివరకు ఎదురుచూడాలని తాను భావిస్తున్నట్లు జడ్జి సతీష్ కుమార్ తెలిపారు. నిందితులు ఆలస్యపు ఎత్తుగడలు ప్లే చేస్తున్నారని ఇవాళ కోర్టులో ప్రొసీడింగ్స్ సమయంలో నిర్భయ తల్లిదండ్రులు ఆరోపించారు. ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని,మరో వారం రోజులు ఎదురుచూస్తామని ఢిల్లీ కోర్టు డిసెంబర్ 18కి పిటిషన్ వాయిదా వేసిన అనంతరం నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో అన్నారు.
ANI Tweet
Delhi Court adjourns hearing in Nirbhaya rape case till Dec 18
Read @ANI Story |https://t.co/whUhmlrhF8 pic.twitter.com/WlmApVkViq
— ANI Digital (@ani_digital) December 13, 2019
నిజానికి మరణశిక్ష తీర్పు వెలువడిన వెంటనే ఈ నలుగురు రివ్యూ పిటిషన్‌కు వెళ్లే అవకాశం ఉన్నా.. శిక్షను వాయిదా వేయాలన్న కారణంతోనే ఆలస్యంగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. అది కూడా నలుగురు ఒకేసారి కాకుండా.. వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా కాలాయాపన చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే నిర్భయ దోషులు పవన్ గుప్తా,ముఖేశ్ సింగ్,వినయ్ శర్మ రివ్యూ పిటిషన్లను సుప్రీం ఇప్పటికే తోసిపుచ్చింది.
మరోవైపు నిర్భయ దోషులకు ఏకకాలంలో ఉరిశిక్షను అమలు చేసేందుకు తీహార్ జైలు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకే ఉరి కొయ్యకు నలుగురి మెడలకు వేర్వేరు తాళ్లతో కట్టి ఒకేసారి ఏకకాలంలో ఉరిశిక్ష విధించాలని తీహార్ జైలు అధికారులు నిర్ణయించారు. ఇలా నలుగురు దోషులను ఏకకాలంలో ఉరి తీయడం మొట్టమొదటిసారి కానుండటం విశేషం.
వారిని ఉరి తీసేందుకు మీటర్ జైల్లో ఉన్న తలారిని రప్పించిన అధికారులు, జైలులోని ఫాన్సీ కోట బ్యారక్ లో 1950లో ఏర్పాటు చేసిన ఉరి కొయ్యలను పరిశీలించారు. ఉరికొయ్యగా ఉన్న మెటల్ బార్, నలుగురు దోషుల బరువును మోస్తుందా? అని పరిశీలించారు. మరో మెటల్ క్రాస్ బార్ ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. నలుగురికీ ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయాలని భావిస్తున్న అధికారులు, బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి 8 మనీలా ఉరితాళ్లను తెపిపిస్తున్నారు.
ఇవి మృదువుగా, బలంగా ఉండేలా చూడటంతో పాటు దోషులు తక్కువ బాధతో ప్రాణాలు విడిచేందుకు వీలుగా తాళ్లకు వెన్నపూస రాయాలని నిర్ణయించారు. జైలు నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకూ ఒకసారి దోషులు తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిస్తున్నామని తెలిపిన అధికారులు, వారు నిత్యమూ న్యాయవాదులను కలుస్తూ, తమ కేసు పురోగతిని తెలుసుకుంటున్నారని, వారి ప్రవర్తనలో తాము ఎటువంటి మార్పునూ గమనించలేదని స్పష్టం చేశారు.