Abhi Toh Suraj Uga Hai: ఇప్పుడే సూర్యుడు ఉదయించాడంటూ ప్రధాని మోదీ కవిత, స్వయంగా తన కవితను పద్యం రూపంలో వినిపించిన భారత ప్రధాని, మై గ‌వ‌ర్న‌మెంట్ ఇండియా ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్

ఆస్మాన్ మే స‌ర్ ఉటాక‌ర్‌.. ఘ‌నే బాద‌లోంకో చీర్ క‌ర్‌.. రోషినీ కా సంక‌ల్ప్ లే.. అబీ తో సూర‌జ్ ఉగా హై.. అంటూ ప్రధాని తన కవితను రాశారు. 2021 కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఆయ‌న ఈ క‌విత‌ను (Narendra Modi Writes Poem) రాసిన‌ట్లు తెలుస్తోంది. మై గ‌వ‌ర్న‌మెంట్ ఇండియా ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ క‌విత‌తో రూపొందించిన వీడియోను పోస్టు చేశారు.

PM Narendra Modi at Ram Mandir bhumi pujan event (Photo Credits: ANI)

New Delhi, January 1: భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సరం సందర్భంగా కవితను రాశారు. ఆస్మాన్ మే స‌ర్ ఉటాక‌ర్‌.. ఘ‌నే బాద‌లోంకో చీర్ క‌ర్‌.. రోషినీ కా సంక‌ల్ప్ లే.. అబీ తో సూర‌జ్ ఉగా హై.. అంటూ ప్రధాని తన కవితను రాశారు. 2021 కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఆయ‌న ఈ క‌విత‌ను (Narendra Modi Writes Poem) రాసిన‌ట్లు తెలుస్తోంది. మై గ‌వ‌ర్న‌మెంట్ ఇండియా ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ క‌విత‌తో రూపొందించిన వీడియోను పోస్టు చేశారు.

వినీల ఆకాశంలో త‌ల ఎత్తుకుని ఉండాల‌ని.. ద‌ట్ట‌మైన మేఘాల‌ను చీల్చుకుని.. వెలుగు లాంటి సంక‌ల్పంతో ముంద‌కు సాగాల‌ని.. ఇప్పుడే సూర్యుడు ఉద‌యించాడ‌న్న అంశాన్ని (Abhi Toh Suraj Uga Hai) ప్ర‌ధాని మోదీ త‌న క‌విత‌లో తెలిపారు. మోదీయే స్వ‌యంగా ఆ క‌విత‌ను (PM Modi poem) చ‌దివారు. తాను ఇటీవ‌ల గురుద్వారా విజిట్ చేసిన ఫోటోల‌ను కూడా ఆ వీడియోలో పోస్టు చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి వేళ ప్ర‌ధాని మోదీ చేప‌ట్టిన ప‌ర్య‌ట‌న‌ల‌తో పాటు సైనికులు, మెడిక‌ల్ సిబ్బంది, రైతుల‌తో ఆ వీడియోను రూపొందించారు.ఈ కొత్త సంవ‌త్స‌రాన్ని ఈ ప్రేర‌ణాత్మ‌క క‌వితతో ప్రారంభిద్దామ‌ని ఆ ట్వీట్‌లో తెలిపారు. కొత్త ఏడాది సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆరోగ్యం, సంతోషం, స‌మృద్ధి క‌ల‌గాల‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Here's PM Modi Poem: 

‘ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు’ అనే టైటిల్‌తో ఉన్న ఈ పద్యం వీడియో మొత్తం 1.37 నిమిషాల నిడివి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ పద్యాన్ని చదివి వినిపించారు. ఆయన చెబుతున్న పద్య పదాలకు అనుగుణంగా వీడియోను ఎడిట్ చేశారు. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు రాకెట్ ప్రయోగాలు, రాఫెల్ జెట్లు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, రైతులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, త్రివిధ దళాలకు సబంధించిన దృశ్యాలు ఉన్నాయి.

ఇండియాలో మరో నలుగురికి కొత్త వైరస్, 29కి చేరిన మొత్తం కొత్త కరోనావైరస్ కేసులు, ఢిల్లీలో 10, బెంగ‌ళూరులో 10, హైద‌రాబాద్‌లో 3, పుణెలో 5, బెంగాల్‌లోని క‌ళ్యాణిలో 1 కేసు న‌మోదు

2020లో జనం ఎదుర్కొన్న కష్ట నష్టాలను అధిగమించేలా ఇప్పుడే సూర్యుడు ఉదయించాడనే భావన వచ్చేలా ప్రధాని మోదీ ఈ పద్యం రాసినట్లు తెలుస్తోంది. కాగా న్యూ ఇయర్ వేళ ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.హ్యాపీ న్యూ ఇయర్ 2021. ఈ ఏడాది మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, సౌభాగ్యం కలిగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.

వెంటాడుతున్న కొత్త కరోనా, లండన్ నుంచి వచ్చిన 433 మంది మిస్సింగ్, తమిళనాడులో జనవరి 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు, బీచ్‌ల్లో జనసంచారంపై పూర్తి స్థాయి నిషేధం

దీంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. హౌసింగ్ ప్రాజెక్టులపై సమీక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అందరికంటే మిన్నగా అమలు చేస్తున్న రాష్ట్రాలను అభినందించారు. ఏపీలో కూడా పీఎం ఆవాస్ యోజన పథకాన్ని మెరుగ్గా అమలు చేస్తున్నారని ప్రధాని మోదీ కితాబిచ్చారు.



సంబంధిత వార్తలు

G20 Summit 2024: మీ దేశంలో దాక్కున్న ఆ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించండి, జీ20 సమావేశంలో బ్రిటన్ ప్రధానిని కోరిన పీఎం నరేంద్ర మోదీ

Nitish Kumar Tries to Touch PM Modi's Feet: వీడియో ఇదిగో, ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకబోయిన నితీష్ కుమార్, కాళ్లని వెనక్కి తీసుకున్న పీఎం

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్

Putin Heaps Praise on PM Modi: ప్ర‌పంచ దేశాల్లో‌కెల్లా ఇండియానే సూప‌ర్ ప‌వ‌ర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోంద‌ని వెల్లడి