India Covid Updates: 200 మంది విద్యార్థులు,72 మంది టీచర్లకు కరోనా, తెలంగాణలో వ్యాక్సిన్ వేయించుకున్న అంగన్‌వాడీ టీచర్ మృతి, వ్యాక్సిన్ వేయించుకున్న 8 మందికి కరోనావైరస్, దేశంలో తాజాగా 11,067 కోవిడ్ కేసులు, ఏపీలో 70 మందికి కరోనా పాజిటివ్

తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,08,58,371కు చేరింది. కొత్తగా 13,087 మంది వైరస్‌ నుంచి డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,61,608 మంది కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో మరో 94 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,55,252కు (India Covid Updates) పెరిగింది.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, Feb 10: దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 11,067 కరోనా పాజిటివ్‌ కేసులు (India Covid Updates) నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,08,58,371కు చేరింది. కొత్తగా 13,087 మంది వైరస్‌ నుంచి డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,61,608 మంది కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో మరో 94 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,55,252కు (India Covid Updates) పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,41,511 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 66,11,561 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా మంగళవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 7,36,903 కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 20,33,24,655 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు చెప్పింది.

ఇక తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ( TS Coronavirus Vaccination) వికటించి అంగన్‌వాడీ టీచర్ మృతి చెందారు. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట మండలం నందిపాడులో అంగన్‌వాడీ టీచర్ చిన్నీనాలుగు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చిన్నీని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నీ పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందారు.

ఇక కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కొందరు వైరస్ బారిన పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ వేసుకున్న రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఆరుగురు కోవిడ్ వార్డులో చికిత్స పొందుతుండగా.. మరో ఇద్దరు హోంఐసోలేషన్‌లో ఉన్నారు.

జల రక్కసిలో 28కి చేరిన మృతుల సంఖ్య, బయటకు వచ్చిన ప్రమాద శాటిలైట్ దృశ్యాలు, విలయానికి సంబంధించి కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తల ప్రయత్నాలు

ఏపీలో గత 24 గంటల్లో 26,844 కరోనా పరీక్షలు నిర్వహించగా 70 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున గుర్తించారు. అదే సమయంలో 115 మంది కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,88,555 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,478 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 917 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 7,160గా నమోదైంది.

స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో కేరళలోని రెండు పాఠశాలల్లో దాదాపు 200 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. వీరంతా మళప్పురం జిల్లా పెరుంబడప్పు పంచాయతీ మరాంచెరీ, వన్నెరీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నవారు. అక్కడ 72 మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి సైతం పాజిటివ్‌గా తేలింది. వీరిలో మరాంచెరీ పాఠశాలకు చెందినవారు 182 మంది, వన్నెరీ స్కూల్‌వారు 72 మంది ఉన్నారు. ఒకే ప్రాంతంలో ఉన్న ఈ రెండు పాఠశాలల్లో తొలుత ఒక విద్యార్థి వైరస్‌ నిర్ధారణ అవడంతో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టి 638 మందికి పరీక్షలు చేశారు. దీంతో భారీగా పాజిటివ్‌లు వెలుగులోకి వచ్చాయి.

లాక్‌డౌన్ దెబ్బ..ఉద్యోగులకు అనేక రకాల అనారోగ్య సమస్యలు

కేరళలో గత నెల నుంచి పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు భౌతిక తరగతులు ప్రారంభించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహిస్తున్నా.. విద్యార్థులకు వైరస్‌ సోకుతుండటంతో పరిస్థితిని సమీక్షించి తదుపరి చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్‌ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు మిగతా దేశమంతా కరోనా అదుపులోకి వస్తున్నా.. కేరళలో ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో పాజిటివ్‌లు 6 వేలకు తగ్గడం లేదు. మరణాలు కూడా 20వరకు ఉంటున్నాయి. శనివారం నాటికి పాజిటివ్‌ రేటు 7.18గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షల సంఖ్యను భారీగా పెంచింది



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif