Nizamuddin Markaz Row: మత పెద్దల నిర్లక్ష్యమే కొంపముంచిందా, మార్చి 23న భవనం ఖాళీ చేయాలంటూ ఢిల్లీ పోలీసుల ఆదేశాలు, సంచలన వీడియో వెలుగులోకి

విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ (Coronavirus) లక్షణాలు కన్పించడం ఆ వైరస్ అక్కడికి వెళ్లిన వారికి రావడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు (Delhi Police) మార్చి 23న భవనాన్ని ఖాళీ చేయమన్నట్లుగా వీడియో బయటకొచ్చింది.

Delhi Police meeting with Nizamuddin Markaz members (Photo credits: ANI)

New Delhi, March 31: యావత్ దేశాన్నిఇప్పుడు తీవ్ర ఆందోళనలోకి నెట్టి వేసిన అంశం ఏదైనా ఉందంటే అది ఢిల్లీలో నిజాముద్దీన్ ఏరియాలో జరిగిన కార్యక్రమం (Nizamuddin Markaz Row) అనే చెప్పవచ్చు. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ (Coronavirus) లక్షణాలు కన్పించడం ఆ వైరస్ అక్కడికి వెళ్లిన వారికి రావడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు (Delhi Police) మార్చి 23న భవనాన్ని ఖాళీ చేయమన్నట్లుగా వీడియో బయటకొచ్చింది.

ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, మర్కజ్‌ మౌలానాపై కేసు నమోదు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) దేశవ్యాప్తంగా మార్చి 22న లాక్‌డౌన్ (Lockdown) ప్రకటించిన మరుసటి రోజే పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారు. పరిస్థితి తీవ్రతను మత పెద్దలకు వివరించారు. ప్రధానమంత్రి లాక్‌డౌన్‌ను ప్రకటించారని, వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు.

మర్కజ్ భవనంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల వల్ల సంభవించే పరిణామాలను ఢిల్లీ పోలీసులు ముందే పసిగట్టిన నిజాముద్దీన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేష్ వలియాన్ మర్కజ్ మసీదు మత పెద్దలను తన స్టేషన్‌కు పిలిపించి మరీ వారితో మాట్లాడారు. భయానక కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తోందని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు.

Nizamuddin Markaz Management Had Been Told to Vacate Premises on March 23:

దీనికి మత పెద్దలు సహకరించినప్పటికీ దాన్ని ఆచరించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. రెండువేల మందికి పైగా ఉన్న మర్కజ్ భవనాన్ని తాము సగం వరకు ఖాళీ చేయించామని, ప్రస్తుతం వెయ్యి మంది మాత్రమే ఉన్నారంటూ మత పెద్దలు సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు కొంపలు ముంచిందని వార్తలు వస్తున్నాయి.

టూరిస్ట్ వీసాతో వచ్చి మతపరమైన ప్రచారం నిర్వహించిన విదేశీయులు

ఇదిలా ఉంటే మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొనడానికి వెయ్యిమందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ.. రెండువేల మందికి పైగా హాజరయ్యారనే సమాచారం తమ వద్ద ఉందని ఎస్‌హెచ్ఓ ముఖేష్ వలియాన్ స్పష్టం చేశారు. భవనాన్ని ఖాళీ చేయకపోతే తామే ఆ పని చేయాల్సి ఉంటుందని, అక్కడిదాకా పరిస్థితిని తీసుకుని రావొద్దంటూ ఆయన సూచించారు. అయినప్పటికీ- మర్కజ్ మత పెద్దలు పట్టించుకోలేదని, దాని ఫలితంగా దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య భారీగా పెరగడానికి కారణమైందని చెబుతున్నారు.

ఏపీలో ‘ఢిల్లీ’ కరోనా కల్లోలం

ఇది ఇప్పుడు రాజకీయ రంగును పులుముకునేలా ఉంది. మర్కజ్ సామూహిక మత ప్రార్థనల వెనుక కుట్ర కోణం ఉందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూరకంగానే మర్కజ్ మత పెద్దలు సామూహిక ప్రార్థనలకు పిలుపునిచ్చారని విమర్శిస్తున్నారు. ఈ ఘటన వెనుక గల అన్ని కారణాలను వెలికి తీయాలంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సహా పలువురు ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామూహిక మత ప్రార్థనల ఉద్దేశం ఏమిటనేది విషయాన్ని వెలికి తీయాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకూడా దర్యాప్తునకు ఆదేశించింది.