Morbi Suspension Bridge Collapse: నా జీవితంలో అత్యంత విషాద ఘటన, ఒక వైపు నొప్పితో నిండిన హృదయం, మరో వైపు కర్తవ్యం, గుజరాత్‌లోని తీగల వంతెన ప్రమాదంపై ప్రధాని మోదీ

ఇప్పటి వరకు 141 మంది మరణించినట్టుగా అధికారులు లెక్క తేల్చారు. 177 మందిని రక్షించారు.ప్రమాదం నేపథ్యంలో గుజరాత్‌లో నేటి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేసుకున్నారు.

Morbi Suspension Bridge Collapse. (Photo Credits: ANI)

Morbi, October 31: గుజరాత్‌లోని తీగల వంతెన కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఇప్పటి వరకు 132 మంది మరణించినట్టుగా అధికారులు లెక్క తేల్చారు. 177 మందిని రక్షించారు.ప్రమాదం నేపథ్యంలో గుజరాత్‌లో నేటి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేసుకున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఈ ఉదయం మోర్బీలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, సెర్చ్ ఆపరేషన్, రిలీఫ్-రెస్క్యూ ఆపరేషన్, క్షతగాత్రులకు చికిత్స చేయడంతో పాటు #MorbiBridgeCollapse సంఘటనలో సిస్టమ్‌కు అవసరమైన సూచనలను అందించారు.

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నిన్న రాత్రి మోర్బీ చేరుకున్నారు. అతను నిన్నటి నుండి శోధన & రెస్క్యూ మీద అధికారులతో సమీక్షలు జరుపుతున్నాడు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రెస్క్యూ & రిలీఫ్ ఆప్స్‌లో ఎలాంటి అలసత్వం ఉండదని నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. నేను ఏక్తా నగర్‌లో ఉన్నాను కానీ నా మనసు మాత్రం మోర్బీ బాధితులపైనే ఉంది. నా జీవితంలో చాలా అరుదుగా, నేను అలాంటి బాధను అనుభవించాను. ఒక వైపు, నొప్పితో నిండిన హృదయం మరియు మరోవైపు, కర్తవ్యానికి మార్గం ఉందని గుజరాత్‌లోని కెవాడియాలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో పేర్కోన్నారు.

మృత్యు వంతెన... గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలిన ప్రమాదంలో 132కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయ చర్యలు

ప్రమాదంలో (#MorbiTragedy) ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో, ప్రభుత్వం అన్ని విధాలుగా మృతుల కుటుంబాలకు అండగా ఉంటుంది. గుజరాత్ ప్రభుత్వం నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపట్టింది. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తోందన్నారు.క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు కనీస సమస్యలను ఎదుర్కొంటున్నారని నిర్ధారించడానికి ప్రాధాన్యత ఇవ్వబడిందన్నారు.

మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తీగల వంతెన నిన్న సాయంత్రం ఒక్కసారిగా (2022 Morbi bridge collapse) కూలిపోయింది. ఆ వెంటనే అక్కడ దృశ్యాలు భీతావహంగా మారిపోయాయి. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 500 మంది వరకు ఉన్నారు. ప్రమాదం జరిగాక కొందరు నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకోగా, మరికొందరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారి కోసం బోట్ల సాయంతో గాలిస్తున్నారు.

గుజరాత్ లోని మోర్బీలో కూలిన కేబుల్ బ్రిడ్జి, ప్రమాదం సమయంలో బ్రిడ్జిపై 400 మంది జనం, కొనసాగుతున్న సహాయక చర్యలు, ప్రధాని మోదీ విచారం..

సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరమ్మతుల కోసం ఏడు నెలలపాటు మూసివేసిన ఈ బ్రిడ్జిని ఈ నెల 26న తిరిగి తెరిచారు. ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బ్రిజేష్ మెర్జా ప్రకటించారు. . ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని హోం మంత్రి హర్ష్ సంఘ్వి తెలిపారు.