Rain Alert for AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీ ప్రజలకు నాలుగు రోజుల పాటు రెయిన్ అలర్ట్, తమిళనాడుకు ముంచెత్తనున్న భారీ వర్షాలు

ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దైన సంగతి విదితమే. మళ్లీ రాష్ట్రానికి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

IMD Issues 4 Days Rain Alert To Telangana, Andhra Pradesh(X)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వానలు వీడడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దైన సంగతి విదితమే. మళ్లీ రాష్ట్రానికి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.

తమిళనాడుకు మరో తుపాను ముప్పు, వచ్చే 48 గంటల్లో అల్లకల్లోలంగా మారనున్న బంగాళాఖాతం, తెలుగు రాష్ట్రాలకు 4 రోజులు పాటు వర్ష సూచన

ఈ క్రమంలో తమిళనాడు(Tamil Nadu)కు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం(Bay of Bengal) అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురానికి ఆరెంజ్ అలెర్ట్ జారీచేశారు. తమిళనాడులోని 19 జిల్లాల్లో రెండ్రోజులపాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్త‌గా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.