Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Vjy, Nov 7: తెలుగు రాష్ట్రాలను గత నెలలో వణికించిన వానలు మళ్లీ వణికించేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం (Weather Forecast for Telugu States) ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.

వీడియో ఇదిగో, బస్సు నడుపుతూ గుండెపోటుతో సీట్లోనే కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్‌, వెంటనే డ్రైవింగ్ సీటు పైకి దూకి 42 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్

అలాగే, తమిళనాడుకు తుపాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురానికి ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. తమిళనాడులోని 19 జిల్లాల్లో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొంది.