'Let Me Say It Now': ముంబై దాడులను హిందువులే చేసిన చర్యగా చిత్రీకరించేలా ఉగ్రవాద సంస్థల కుట్ర, రాకేష్ మారియా ‘లెట్ మీ సే ఇట్ నౌ’ పుస్తకంలో సంచలన విషయాలు
భారతదేశ చరిత్రలో చీకటి రోజు ఏదైనా ఉందంటే అది 26/11 (26/11 Mumbai Terror Attacks) అనే చెప్పవచ్చు. ఈ దాడిపై కొన్ని సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ దాడిని హిందూ ఉగ్రవాద (Hindu Terror) చర్యగా చిత్రీకరించేందుకు ‘లష్కరే తాయిబా’ ఉగ్రవాద సంస్థ కుట్రలు పన్నినట్లు తేలింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా (Former Mumbai Police Commissioner) ‘లెట్ మీ సే ఇట్ నౌ’ (Let Me Say It Now) పేరిట రచించిన పుస్తకంలో ఈ వివరాలు వెల్లడించారు.
Mumbai, February 19: భారతదేశ చరిత్రలో చీకటి రోజు ఏదైనా ఉందంటే అది 26/11 (26/11 Mumbai Terror Attacks) అనే చెప్పవచ్చు. దాదాపు పన్నేండేండ్ల కిందట దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పాకిస్థాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు సాగించిన అత్యంత భయానకమైన ఉగ్రదాడిలో (Mumbai Terror Attacks) 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా గాయపడ్డారు.
ఈ మారణహోమం అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు అజ్మల్ కసబ్ (Ajmal Kasab). ఈ పాకిస్థానీ టెర్రరిస్టు తన సహచరులతో కలిసి విచ్చలవిడిగా కాల్పులు, పేలుళ్లకు పాల్పడి వందలాది మందిని పొట్టనబెట్టుకున్నాడు. అయితే ఈ దాడిపై కొన్ని సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
ఈ దాడిని హిందూ ఉగ్రవాద (Hindu Terror) చర్యగా చిత్రీకరించేందుకు ‘లష్కరే తాయిబా’ ఉగ్రవాద సంస్థ కుట్రలు పన్నినట్లు తేలింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా (Former Mumbai Police Commissioner) ‘లెట్ మీ సే ఇట్ నౌ’ (Let Me Say It Now) పేరిట రచించిన పుస్తకంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ పుస్తకం సోమవారం విడుదలైంది.
నిరసనల పేరుతో రోడ్లు బ్లాక్ చేస్తారా
కసబ్‌ను హిందూత్వ ఉగ్రవాదిగా చిత్రీకరించి, ఆ దాడులు హిందూత్వ ఉగ్రదాడులుగా చిత్రించాలని కుట్ర పన్నడం, పోలీసులకు చిక్కిన కసబ్‌ను పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, లష్కరే సంస్థలు చంపాలనుకోవడం తదితర ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో రాకేష్ మారియా (Rakesh Maria) రాశారు. ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి అయిన రాకేశ్ మారియా ముంబై పేలుళ్లు కేసును దర్యాప్తు చేశారు.
పార్లమెంట్ ఓకే అంటే పీఓకే మనదే
తన పుస్తకంలో.. నాడు కసబ్ కాల్పులు జరుపుతున్న సమయంలో అతడి చేతికి ఎర్రని దారం ఉంది. కసబ్ ఆ దారం కట్టుకోవడం వెనుక కుట్ర దాగివుందని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా తెలిపారు. కసబ్ చేతికున్న 'ఎర్ర దారం' హిందుత్వాన్ని సూచిస్తుందని, దాడులు చేసింది ఓ హిందూ ఉగ్రవాది అని చూపేందుకు ఆ దారం ధరించాడని మారియా తన పుస్తకంలో వివరించారు.
3 రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యూహ రచన
కసబ్ పేరును కూడా హిందుత్వాన్ని సూచించేలా 'సమీర్ దినేశ్ చౌధరీ' అని నకిలీ ఐడీ కార్డు సృష్టించారని తెలిపారు. హిందూ ఉగ్రవాదం వల్లే ముంబయి నరమేధం జరిగిందని నిరూపించడమే నాడు లష్కరే తోయిబా ఉగ్రసంస్థ పన్నాగం అని వెల్లడించారు. ‘అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే అతడు సమీర్ చౌదరిగానే మరణిస్తాడు. దీంతో మీడియా దాన్ని హిందూ ఉగ్రవాద చర్యగా భావిస్తుంది’ అని లష్కరే తాయిబా కుట్ర పన్నినట్లు తెలిపారు.
Here's Netizen Shivangi Thakur Tweet
అయితే, అతడు సజీవంగా దొరకడంతో పాటు, భారత దర్యాప్తు సంస్థలు అతడి వాస్తవ గుర్తింపును సమర్థంగా వెలికితీయడంతో పాక్ ఐఎస్ఐ, లష్కరే తోయిబాలకు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. దీంతో భారత్‌లో జైళ్లో ఉన్న కసబ్‌ను హతమార్చాలని నిర్ణయించి ఆ బాధ్యతను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు అప్పగించాయని రాకేశ్ మారియా పేర్కొన్నారు.
పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి
వాస్తవానికి కసబ్ దొంగతనాలు చేసేందుకు లష్కరే తాయిబాలో చేరారు. జీహాద్‌తో అతడికి సంబంధం లేదు. అయితే భారత్‌లో ముస్లింలను నమాజ్ చేసుకునేందుకు కూడా అనుమతించరని అతడిని నమ్మించారు. మెట్రో సినిమా థియేటర్ సమీపంలోని మసీదులో కసబ్‌ను ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించినప్పుడు అతడు షాక్‌కు గురయ్యాడు’ అని మరియా తన పుస్తకంలో పేర్కొన్నారు.
పుల్వామా దాడిలో కీలక పాత్ర పోషించిన కశ్మీర్ జైషే చీఫ్ హతం
ముంబై దాడులకు వెళ్లే ముందు లష్కరే తాయిబా సూత్రధారులు కసబ్‌కు రూ.1.25 లక్షలు అందజేసి, వారం రోజులు సెలవులు ఇచ్చారని చెప్పారు. ఆ నగదును అతడు తన సోదరి పెండ్లి కోసం కుటుంబ సభ్యులకు అందజేశాడని తెలిపారు.
నవంబర్ 21, 2012న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైళ్లో ఉరి తీశారు. నిజానికి ఐఎస్‌ఐ, లష్కరే ఆ దాడులను 2008లో నవంబర్ 26న కాకుండా, సెప్టెంబర్ 27వ తేదీన జరపాలనుకున్నాయి. ఆ తేదీ అప్పటి రంజాన్ ఉపవాస రోజుల్లో 27వది. ఈ విషయాలను మారియా తన పుస్తకంలో పేర్కొన్నారు.
షీనా బోరా కేసులోనూ సంచలనాలు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్య కేసుకు సంబంధించి కూడా మారియా తన పుస్తకంలో పలు కీలక అంశాలు వెల్లడించారు. తన అనంతరం ముంబై పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అహ్మద్ జావేద్ షీనా బోరా హత్య కేసు నిందితులు ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాలకు ముందే తెలుసునని చెప్పారు. అలాగే పీటర్‌కు నాటి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేన్ భారతికి కూడా మంచి పరిచయం ఉన్నదని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్కాడ్ అధిపతిగా పనిచేస్తున్న దేవేన్ ఈ ఆరోపణలను ఖండించారు. వాస్తవాలను వెల్లడించడానికి బదులు పుస్తకాన్ని అమ్ముకునేందుకు చేస్తున్న మార్కెటింగ్ ప్రయత్నాలు ఇవని విమర్శించారు. ఈ కేసులో పీటర్ ముఖర్జియాను 2015 నవంబర్ 19న అరెస్ట్‌చేశారు. ఈ కేసులో ఆయన మాజీ భార్య ఇంద్రాణి ప్రధాన నిందితురాలు. ఇంద్రాణి మొదటి భర్త కూతురే షీనాబోరా. మరో కేసులో ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)