Multiple agencies warn central govt of possible ‘terror attack’ by JeM

New Delhi, November 10: గత 10 రోజుల నుంచి బాబ్రీ మసీద్ -రామ్ జన్మభూమి కేసు (Babri Masjid- Ram Janmabhoomi case) మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడం, సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగిపోయింది. దేశ వ్యాప్తంగా ఏమైనా దాడులు జరుగుతామయేమోనని ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్లా భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే పాకిస్తాన్ కేంద్రంగా ఇండియాలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు(Military Intelligence) హెచ్చరిస్తున్నాయి.

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు అనంతరంభారత్‌పై అతిపెద్ద ఉగ్రదాడి (major terror attack) జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది.

ఇదిలా ఉంటే అయోధ్య తీర్పు మరికొన్నిరోజుల్లో వెలువడుతుందన్న వార్తలు ప్రారంభమైనప్పటి నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ( Pakistan-based terror group Jaish-e-Mohammed) కదలికలు తీవ్రం అయ్యాయి. ఇప్పుడు తీర్పు రావడంతో భారీ దాడులకు పాల్పడేందుకు ఉగ్ర సంస్థ పొంచి రెడీగా ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) (Research and Analysis Wing)నిఘా సంస్థలు హెచ్చరించాయి.

దీనిపై కేంద్రానికి సమాచారం అందించాయి. కాగా దీనికి ఉగ్రవాదులు దాడుల పథక రచనకు సంబంధించి పంచుకున్న సమాచారం డార్క్ వెబ్(dark web)లో ప్రత్యక్షమైందని సమాచారం.

టెర్రిస్టులు ప్రధానంగా 3 రాష్ట్రాలపై నిఘా పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై టెర్రరిస్టులు దృష్టి పెట్టాయని సమాచారం. మొత్తానికి అతి పెద్ద విధ్వంసానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్టు తమకు సమాచారం అందిందని ఓ ఉన్నతస్థాయి అధికారి వెల్లడించారు.

డార్క్ వెబ్(dark web) కోడ్ ద్వారా వీరు సమాచారాన్ని పంచుకుంటున్నారని అయితే అది encrypted కావడం వల్ల తెలుసుకోలేకపోతున్నామని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.