Rudratej Singh Passes Away: బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో ఆకస్మిక మృతి, రుద్ర తేజ్ సింగ్ మరణం తీరని లోటు అని సంతాపం తెలిపిన బీఎండబ్ల్యూ సంస్థ

ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం (BMW) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. గతేడాది ఆగస్టులో బీఎండబ్ల్యూ అధ్యక్ష బాధ్యతలతో పాటు సీఈవోగా ఎంపికైన రుద్రపతాప్ అకస్మాత్తుగా మరణించడంపై దిగ్భాంతా వ్యక్తం చేస్తున్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది.

BMW Group India President and CEO Rudratej Singh. (Photo Credits: ANI)

New Delhi, April 20: జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు, సీఈవో రుద్రతేజ్ సింగ్ (46) (BMW India CEO Rudratej Singh) సోమవారం ఉదయం హఠాత్తుగా కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం (BMW) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. గతేడాది ఆగస్టులో బీఎండబ్ల్యూ అధ్యక్ష బాధ్యతలతో పాటు సీఈవోగా ఎంపికైన రుద్రతేజ్అకస్మాత్తుగా మరణించడంపై దిగ్భాంతా వ్యక్తం చేస్తున్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. ఇండియా కొత్త ఎఫ్‌డీఐ రూల్స్, ఆవేశం వెళ్లగక్కిన చైనా

ఇదిలా ఉంటే ఈ నెల 7న బీఎండబ్ల్యూ సేల్స్ డైరెక్టర్ మిహిర్ దయాళ్ క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. ఇప్పుడు రుద్రతేజ్కూడా మరణించడంతో బీఎండబ్ల్యూ ఇండియాలో భారీ లోటు ఏర్పడింది. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనికి తోడు అనుభవజ్ఞులైన సిబ్బందిని కోల్పోవడంతో భారత్‌లో ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లైంది.

ఇదిలా ఉంటే బీఎండబ్ల్యూ సీఈవోగా ఎంపికవడానికి ముందు రుద్రతేజ్ సింగ్ (Rudratej Singh) రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ ప్రెసిడెంట్‌గా నాలుగున్నరేళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి ప్రవేశించే ముందు యూనిలివర్ సంస్థలో 16 ఏళ్లపాటు పని చేశారు. 1996లో యూపీలో చిన్న ఏరియా సేల్స్ మేనేజర్‌గా జీవితం ప్రారంభించిన రుద్రతేజ్ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి ఎదిగారు.

2019 ఆగస్టు 1 ఆగస్టులో బీఎండబ్ల్యూ అధ్యక్ష బాధ్యతలతో పాటు సీఈవోగా ఎంపికైన రుద్రతేజ్ సింగ్ బీఎండబ్ల్యూ సంస్థకు నాయకత్వాన్ని చేపట్టిన మొదటి భారతీయుడుగా నిలిచారు. అంతకు ముందు రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో గ్లోబల్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 25 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవాన్ని సొంతం చేసుకున్న రుద్ర ప్రతాప్ ఆటోమోటివ్, నాన్-ఆటోమోటివ్ పరిశ్రమలో అనేక నాయకత్వ పదవులను చేపట్టి విజయం సాధించారు.

మార్కెటింగ్ రంగంలో ఎదగాలనుకునే యువతకు ఆయన ఓ స్ఫూర్తిగా నిలుస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.భారతదేశం అంతటా డీలర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలను అమలు చేస్తున్న సమయంలో ఆయన మరణం తమకు తీరని లోటని సంస్థ తెలిపింది.ఈ కష్ట కాలంలో కుటుంబంతోపాటు సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. స్ఫూర్తిదాయకమైన , మానవత్వమున్న నాయకుడిగా రుద్ర నిలిచిపోతారని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif