Baba Ramdev: ‘సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. షారుఖ్ తనయుడు డ్రగ్స్ వాడుతూ దొరికిపోయాడు. ఇది అందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్ గురించి నాకు తెలియదు. ఇక, హీరోయిన్ల గురించి ఆ దేవుడికే తెలియాలి’ బాలీవుడ్ పరిశ్రమపై యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ తారల్లో చాలామంది డ్రగ్స్ వాడుతుంటారని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, అమీర్ ఖాన్ గురించి తనకు తెలియదని, కానీ షారుఖ్ ఖాన్ తనయుడు డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని, జైల్లో కూడా ఉన్నాడని బాబా రాందేవ్ వివరించారు.

RamDev (File: Twitter)

Mumbai, October 17: ‘సల్మాన్ ఖాన్ (Salman Khan) డ్రగ్స్ తీసుకుంటాడు. షారుఖ్ తనయుడు డ్రగ్స్ (Drugs) వాడుతూ దొరికిపోయాడు. ఇది అందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్ (Ameer Khan) గురించి నాకు తెలియదు. ఇక, హీరోయిన్ల గురించి ఆ దేవుడికే తెలియాలి’ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో రాజకీయ నాయకుడు అనుకుంటే పొరపాటే. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ (Baba Ramdev) బాలీవుడ్ స్టార్లపై ఈ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ తారల్లో చాలామంది డ్రగ్స్ వాడుతుంటారని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, అమీర్ ఖాన్ గురించి తనకు తెలియదని, కానీ షారుఖ్ ఖాన్ తనయుడు డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని, జైల్లో కూడా ఉన్నాడని బాబా రాందేవ్ వివరించారు. నటీమణుల విషయానికొస్తే వారి విషయం దేవుడికే తెలియాలని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ చుట్టూ డ్రగ్స్ ప్రపంచం విస్తరించి ఉందని, రాజకీయ రంగంలోనూ మాదకద్రవ్యాలు ఉన్నాయని, ఎన్నికల సందర్భంగా మద్యం పంచడం తెలిసిందేనని బాబా రాందేవ్ పేర్కొన్నారు.

‘అవును. నా భర్త తప్పు చేశాడు. జైలులో ఉన్నాడు. అయితే, ఆయన తప్పు చేస్తే, నాకెందుకు శిక్ష? నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, అతను నాకు సంతానాన్ని ఇవ్వాల్సిందే. ఆయనను విడుదల చేయండి. మేము కలిసి పిల్లల్ని కంటాం.’ ఓ వివాహిత పిటిషన్.. కోర్టు ఏమన్నదంటే?

డ్రగ్ వ్యసనం బారి నుంచి భారత్ కు విముక్తి కల్పించాలని అన్నారు. అందుకోసం ఒక ఉద్యమంలా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. యూపీలోని మొరాదాబాద్ లో నిర్వహించిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులలో బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif