14 Years sentence for Former Pakistan PM Imran Khan on Corruption Case(ANI)

Delhi, Jan 17:  అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆల్ ఖాదిర్ అనే ట్రస్ట్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా సంచలన తీర్పు ఇచ్చారు.

ఇమ్రాఖాన్ కు 14ఏళ్లు, ఇమ్రాన్ భార్య బుష్రా బీబీకి ఏడేళ్లు జైలు శిక్షను విధించారు న్యాయమూర్తి. అలాగే ఇమ్రాన్ కు రూ.10లక్షలు, బుష్రాకు రూ.5లక్షలు జరిమానా విధించారు. ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు తీర్పు వాయిదా పడగా తాజాగా తీర్పును వెలువరించారు న్యాయమూర్తి.  ఎలాన్ మస్క్‌కు గట్టి షాక్... పేలిన స్పెస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్,సాంకేతికలోపం తలెత్తడంతో పేలిన రాకెట్..వీడియో

1996లో ఇమ్రాన్ ఖాన్ దంపతులు ఆల్ ఖాదిర్ ట్రస్ట్ ను స్థాపించారు. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం ఈ ట్రస్ట్ పనిచేస్తుండగా పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానాకు 190 మిలియన్ పౌండ్లు నష్టం కలిగించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. కోర్టు తాజా తీర్పుతో పీటీఐ పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.

14 Years sentence for Former Pakistan PM Imran Khan on Corruption Case