టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు బిగ్ షాక్. స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కారెట్ స్టార్‌షిప్‌ విఫలమైంది. సాంకేతిక లోపం తలెత్తడంతో పేలిపోయింది రాకెట్. టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా గురువారం సాయంత్రం 4.37 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు.

భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు సాంకేతిక లోపం తలెత్తడంతో పేలిపోగా దాని శకలాలు కరేబియన్‌ సముంద్రంలో పడిపోయాయి. పెద్దఎత్తున నిప్పులు చిమ్ముతూ అవి పేలిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

232 అడుగుల భారీ రాకెట్‌ అయిన స్టార్‌షిప్‌లో మొత్తం 33 రాప్టర్‌ ఇంజిన్లు వాడారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. విజయవంతం కాకపోయిన.. వినోదం మాత్రం గ్యారెంటీ అంటూ పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ షట్‌డౌన్...వెల్లడించిన వ్యవస్థాపకుడు అండర్సన్, తమ రీసెర్చ్‌ ఎలా సాగిందనేది వీడియోల ద్వారా వెల్లడిస్తామని ప్రకటన

Elon Musk SpaceX Starship destroyed in test flight

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)