Saif Ali Khan Stabbing Accused (Credits: X)

Mumbai, Jan 19: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ పై (Saif Ali Khan) కత్తితో దాడి చేసిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు (Mumbai Police) అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత థానేలో నిందితుడు విజయ్‌ దాస్‌ ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అతని అసలు పేరు మహమ్మద్‌ అలియాస్‌ బీజే అని తెలిపారు. ముంబైలోని పబ్‌ లో విజయ్‌ దాసే అనే పేరుతో పనిచేస్తున్నాడని చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున థానేలోని హరినందాని ఎస్టేట్‌ సమీపంలోని మెట్రో నిర్మాణం చేస్తున్న కార్మికుల క్యాంపులో అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబై డీసీపీ ఆఫీస్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు. అనుమానితుడు అంతకుముందు దొంగతనం చేస్తున్న వీడియో వెలుగులోకి..

అతను కాదు..

శనివారం ఛత్తీస్‌ గఢ్‌ లో అరెస్టు చేసిన అనుమానితుడు కైలాశ్‌ అసలైన నిందితుడు కాదని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సైఫ్ అలీఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్... నిందితుడిని పట్టుకున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు, తేల్చిచెప్పిన ముంబై పోలీసులు