Tamil Nadu: తమిళనాడులో విషాదం, కొడుకు 10వ తరగతి ఫెయిల్ అయ్యాడని తండ్రి ఆత్మహత్య, కేసు నమోదుచేసి విచారణ చేస్తున్న అంబాపేట పోలీసులు

పదో తరగతి పరీక్షల్లో కొడుకు ఫెయిలయ్యాడని తండ్రి ఆత్మహత్య (Father kills self) చేసుకున్నాడు. ఈ ఘటన ఈరోడ్‌ జిల్లా అంబాపేట సమీపంలో జరిగింది.

representational image (photo-Getty)

Chennai, July7: తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి పరీక్షల్లో కొడుకు ఫెయిలయ్యాడని తండ్రి ఆత్మహత్య (Father kills self) చేసుకున్నాడు. ఈ ఘటన ఈరోడ్‌ జిల్లా అంబాపేట సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాపేట సమీపం కల్బావి తొట్టిపాళ్యెంకు చెందిన అప్పుస్వామి (45), సుమతి దంపతులకు సంజయ్‌ (15), చంద్రు ఇద్దరు కుమారులు ఉన్నారు. మైలంపాడి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి (CLASS 10 BOARD EXAMS) చదువుతున్న సంజయ్‌ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిలయ్యాడు. వీడు టీచరా లేక శాడిస్టా, పిల్లాడిని అంత దారుణంగా కొడతారా, బీహార్‌లోని పాట్నాలో ఘటన, వీడియో వైరల్ కావడంతో టీచర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు

అప్పుస్వామి కుమారుడిని మందలించి ట్యూషన్‌కు పంపించాడు. అయితే సంజయ్‌ దాన్ని పట్టించుకోకపోవడంతో అప్పుస్వామి ఆందోళనకు గురయ్యాడు. పురుగుల మందు తాగి స్పృహ తప్పాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని ఈరోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతను బుధవారం మృతి చెందాడు. దీనిపై అంబాపేట పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు.