Train Accident in Tamil Nadu: గూడ్స్ రైలుని ఢీకొన్న భాగమతి ఎక్స్ ప్రెస్.. పట్టాలుతప్పిన 12 కోచ్ లు.. చెలరేగిన మంటలు.. 19 మందికి గాయాలు .. తమిళనాడులో ఘటన (వీడియోతో)
శుక్రవారం రాత్రి ఓ గూడ్స్ రైలుని మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్ ప్రెస్ ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది.
Chennai, Oct 12: తమిళనాడులోని (Tamil Nadu) తిరువళ్లూరులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఓ గూడ్స్ రైలుని మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్ ప్రెస్ ప్రమాదవశాత్తు (Train Accident) ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎక్స్ ప్రెస్ రైలులోని 12 కోచ్ లు పట్టాలు తప్పాయి. రెండు కోచ్ లకు మంటలు వ్యాపించాయి. 19 మంది ప్రయాణికులు గాయపడ్డారని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అదే ట్రాక్ పై నిలిచివున్న ఓ గూడ్స్ రైలుని వెనుక నుంచి వచ్చిన దర్భంగా ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిందని రైల్వే వర్గాలు తెలిపాయి.
పలు రైళ్లు దారి మళ్లింపు
భాగమతి రైలు ప్రమాదం కారణంగా చెన్నై- గూడూరు ప్రాంతంలో మూడు రైళ్లు తిరుచిరాపల్లి -హౌరా ఎక్స్ ప్రెస్, ఎర్నాకులం -టాటానగర్ ఎక్స్ ప్రెస్, కాకినాడ- ధన్ బాద్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయాయి. వీటిని ఇతర మార్గాల్లో మళ్లించాలని యోచిస్తున్నట్టు రైల్వే అధికారులు చెప్పారు.
ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు