Telangana Horror: సంగారెడ్డి జిల్లాలో దారుణం, అందరూ చూస్తుండగానే రోడ్డుపై తల్లి, కొడుకులను కత్తితో నరికిన దుండగులు, పాతకక్షలే కారణం
గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని వీరభద్రకాలనీలో ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే పాత కక్షలతో తల్లీకొడుకులను కత్తితో పొడిచి చంపేశాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తల్లీకొడుకలను కత్తితో పొడిచి చంపేశాడు.
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని వీరభద్రకాలనీలో ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే పాత కక్షలతో తల్లీకొడుకులను కత్తితో పొడిచి చంపేశాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తల్లీకొడుకలను కత్తితో పొడిచి చంపేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులు యూపీకి చెందిన సరోజాదేవి (50), అనిల్ (30)గా గుర్తించారు. కాగా, పాత గొడవలే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. తన రెండేళ్ల కొడుకు చావుకు వీరు కారణమని అందుకే వారిని చంపినట్లు నిందితుడు నాగరాజు చెబుతున్నట్లు తెలుస్తోంది.
Thug stabbed a mother and son on the road in Sangareddy district
తన భార్యపై కూడా మృతులిద్దరూ దాడి చేసేందుకు ఇంట్లోకి వచ్చినట్లు ఆరోపించాడు. కొడుకు చనిపోయిన రెండేళ్ల తర్వాత కక్ష పెంచుకుని ఈ రోజు కత్తితో దాడి చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది.