Amaravati Farmers Bandh: రాజధాని గ్రామాల్లో బంద్, అమరావతి పరిధిలోని 29 గ్రామాలు బంద్‌లోకి.., అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ఆమోదం, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్న రైతులు
దీంతో పాటుగా రైతులపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా అమరావతి జేఏసీ (Amaravathi JAC) బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాజధానిలోని 29 గ్రామాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.
Amaravati, January 21: ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు(Three Capitals) నిరసనగా నేడు ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని గ్రామాలు బంద్ కు పిలుపు నిచ్చాయి. దీంతో పాటుగా రైతులపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా అమరావతి జేఏసీ (Amaravathi JAC) బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాజధానిలోని 29 గ్రామాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.
చంద్రబాబు అరెస్ట్, 3 రాజధానుల బిల్లు అమోదం
బంద్ నేపథ్యంలో పోలీసులకు పూర్తిగా సహాయ నిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని రైతులు(Amaravati Farmers Protest) స్పష్టం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు సిఆర్‌డిఎకి (CRDA)అభిప్రాయాలు చెప్పుకునే సమయం కోర్టు ఇవ్వగా.. ముందే బిల్లును ఎలా ఆమోదిస్తారని ప్రశ్నిస్తున్నారు.
అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్
మంచినీరు సహా ఏ పదార్థాలు పోలీసులకు విక్రయించకూడదని, పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని నిర్ణయించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 35వ రోజుకు చేరుకున్నాయి. శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినా రైతులు తమ నిరసనలు ఆపడంలేదు.
Here's ANI Tweet
మందడం, తుళ్లూరులో మహాధర్నాలు వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు, మహిళలు నిరసన తెలుపుతూ పూజలు నిర్వహిస్తున్నారు. రాజధాని గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు రాజధానిపై ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
మరోవైపు రాజధాని గ్రామాల్లో పోలీసు పహారా కొనసాగుతోంది. ప్రతి గ్రామానికిరెండు వైపులా పోలీసులు మొహరించారు. సచివాలయానికి వెళ్లే మల్కాపురం సెంటర్ లోనూ పోలీసులు భారీగా మొహరించారు.సచివాలయం వెనుక వైపు కూడా పోలీసు బందో బస్తుఏర్పాటు కొనసాగుతోంది.