COVID-19: విదేశాల్లోని భారతీయుల కోసం బయలు దేరిన మూడు యుద్ధ నౌకలు, యుఎఈ, మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలింపు, వెల్లడించిన కేంద్ర రక్షణ శాఖ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19 pandemic) విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరంతా స్వదేశానికి వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఇండియాకు (India) తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా ముందుగా మాల్దీవులు (Maldives), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో (UAE) చిక్కుకున్న భారతపౌరులను స్వదేశానికి తరలించడానికి భారత నావికాదళం మూడు నౌకలను (Three Ships Sent to Evacuate Indians) పంపించినట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు.
New Delhi, May 5: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19 pandemic) విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరంతా స్వదేశానికి వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఇండియాకు (India) తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా ముందుగా మాల్దీవులు (Maldives), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో (UAE) చిక్కుకున్న భారతపౌరులను స్వదేశానికి తరలించడానికి భారత నావికాదళం మూడు నౌకలను (Three Ships Sent to Evacuate Indians) పంపించినట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. 67 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా, ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్ కార్యాలయం మూసివేత, క్వారంటైన్‌లోకి 50 మంది భద్రతా సిబ్బంది
ముంబై సముద్ర తీరంలో (Mumbai coast) మోహరించిన ఐఎన్ఎస్ జలష్వా, ఐఎన్ఎస్ మగర్ నౌకలను మాల్దీవులకు పంపించారు. ఐఎన్ఎస్ షార్దుల్ అనే మరో నౌకను దుబాయ్ దేశానికి మళ్లించామని కేంద్ర రక్షణ శాఖ ప్రతినిధి వివరించారు. విదేశాల్లో మన భారత పౌరులు లక్షలాదిమంది చిక్కుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో వారిని మూడు నౌకల్లో కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఓడరేవుకు తీసుకువస్తామని రక్షణశాఖ పేర్కొంది. 24 గంటల్లో 195 మంది మృతి, దేశంలో 46 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, దడపుట్టిస్తున్న మహారాష్ట్ర, ముంబైలో మే 17 వరకు 144 సెక్షన్
కరోనా వైరస్ లక్షణాలు లేని వారిని మాత్రమే స్వదేశానికి తీసుకువస్తామని మే 7వతేదీ నుంచి దశలవారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర అధికారులు చెప్పారు. స్వదేశానికి వచ్చాక వారికి వైద్యపరీక్షలు జరిపి 14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తామని అధికారులు చెప్పారు. యుద్ధనౌకలు ఐఎన్ఎస్ మగర్, ఐఎన్ఎస్ శార్దూల్‌లు.. సదరన్ నావెల్ కమాండ్‌కు చెందిన నౌకలు కాగా, ఐఎన్ఎస్ జలష్వా.. ఈస్ట్రన్ నావెల్ కమాండ్‌కు చెందినది. తమిళనాడులో కరోనా కల్లోలం, ఒక్కరోజే 527 కేసులు నమోదు, గ్రీన్ జోన్లలో కేసులు పెరిగితే మరోసారి లాక్‌డౌన్ తప్పదని స్పష్టం చేసిన లవ్ అగర్వాల్
కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఈ నెల 7 నుంచి విడుతల వారీగా వారిని స్వదేశానికి తరలించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. పేమెంట్ ప్రాతిపదికన విమానాలు, నౌకల ద్వారా వారిని తీసుకురానున్నట్లు తెలిపింది. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు భారతీయుల వివరాలు సేకరిస్తున్నాయని వివరించింది. వైరస్ లక్షణాలు లేనివారిని మాత్రమే స్వదేశానికి వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొంది.
ఇక్కడకు చేరుకున్న తర్వాత మరోసారి వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తామని, అనంతరం 14 రోజులపాటు పేమెంట్ ప్రాతిపదికన క్వారంటైన్‌లో ఉంచుతామని తెలిపింది. గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత వారందరూ ఆరోగ్య సేతు యాప్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. విదేశాల నుంచి వచ్చే వారి కోసం టెస్టింగ్, క్వారంటైన్, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలపై భారత్ మార్చి 23న నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)