Tirupati Horror: తిరుపతి జిల్లాలో ఘోరం.. మూడున్నరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడు.. అత్యాచారం చేసి ఆపై హత్య.. కిరాతకుడిని ఉరి తీయాలని స్థానికుల డిమాండ్

మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దారుణ ఘటన ఎయం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీలో చోటుచేసుకుంది.

Rape (Credits: X)

Tirupati, Nov 2: తిరుపతి జిల్లా (Tirupati) వడమాల పేట మండలంలో ఘోరం జరిగింది. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం (Rape) చేసి ఆపై హత్య చేసిన దారుణ ఘటన ఎయం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యానాది కాలనీకి చెందిన మధుకు  మూడున్నరెళ్ళ కుమార్తె సాన్విక ఉంది. అదే కాలనీలో మధుకు సమీప బంధువు అయిన సుశాంత్(22) అనే యువకుడు కూడా నివసిస్తున్నాడు. కాగా చిన్నారికి చాక్లెట్లు, లేస్ ఇస్తానని మాయమాటలు చెప్పిన సుశాంత్.. శుక్రవారం సాయంత్రం చిన్నారిని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్ళాడు. చిన్నారిపై  అత్యాచారం చేసిన కిరాతకుడు అంతటితో ఆగకుండా విషయం బయటకు పొక్కుతుందన్న కారణంతో బాలికను చంపి అక్కడే పూడ్చి పెట్టేశాడు.

వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

ఉరి తీయాలి

రాత్రి అయినా చిన్నారి ఇంటికి రాకపోవడంతో బాలిక కోసం వెతుకులాడిన తల్లిదండ్రులు విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. కన్న కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సుశాంత్ ని పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిందితుడిని ఉరి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif