Tuticorin Custodial Deaths: తండ్రీ కొడుకుల మృతి కేసు సీబీఐకి, తమిళనాడు ట్యూటికోరిన్ కస్టడీ మరణంపై రెండు కేసులు నమోదు చేసిన సీబీఐ
లాక్‌డౌన్ నిబంధనలు (Lockdown Violations) ఉల్లంఘించారనే కారణంతో పి. జయరాజ్ అతడి కుమారుడు బెనిక్స్‌లను (Jayaraj-Bennix custodial deaths) కోవిల్‌పట్టి పోలీసులు అరెస్టు చేసి హింసించి చంపిన విషయం తమిళనాడు (Tamil Nadu) వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి విదితమే. కర్ఫ్యూ సమయంలో కూడా వారు మొబైల్ షాపును తెరిచిఉంచడంతో అరెస్టు చేసినట్లు తమిళనాడు పోలీసులు ఆరోపించారు.
Chennai,July 8: తమిళనాడు పోలీసుల కస్టడీలో మరణించిన (Tuticorin Custodial Deaths) తండ్రికొడుకులు జయరాజ్, బెనిక్స్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) బుధవారం రెండు కేసులను నమోదు చేసింది. లాక్‌డౌన్ నిబంధనలు (Lockdown Violations) ఉల్లంఘించారనే కారణంతో పి. జయరాజ్ అతడి కుమారుడు బెనిక్స్‌లను (Jayaraj-Bennix custodial deaths) కోవిల్‌పట్టి పోలీసులు అరెస్టు చేసి హింసించి చంపిన విషయం తమిళనాడు (Tamil Nadu) వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి విదితమే. కర్ఫ్యూ సమయంలో కూడా వారు మొబైల్ షాపును తెరిచిఉంచడంతో అరెస్టు చేసినట్లు తమిళనాడు పోలీసులు ఆరోపించారు. తండ్రి కొడుకుల విషాద మరణం, ట్యూటికోరిన్ కస్టడీ డెత్ కేసులో అయిదుగురు పోలీసులు అరెస్ట్
దీంతో జయరాజ్, బెన్నిక్స్‌ల కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపడుతున్నట్లు కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అవి క్రూరమైన హత్యలు, తూత్తుకుడి తండ్రీకొడుకులు చనిపోయిన ఘటనపై స్పందించిన రజినీకాంత్, వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరిన తలైవార్
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మహిళ పోలీసు అధికారి తండ్రికొడుకులను జూన్ 19న అరెస్టు చేసి రాత్రంతా హింసించినట్లు జుడిషియల్ మేజిస్ట్రేట్ ఎంఎస్ బరతిదాసన్‌కు తెలిపారు. వారిని కొట్టిన లాఠిలపై, టెబుల్‌పై రక్తం మరకలు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆమె కోరారు.