Union Budget 2021 Highlights: రూ .16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, రైల్వేలకు రూ.1.10 లక్షల కోట్లు కేటాయింపు, కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చే కొత్త పథకం, మరో కోటి మందికి ఉజ్వల పథకం, కేంద్ర బడ్జెట్ 2021-22 హెలెట్స్ ఇవే..
కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చే పథకాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశ పెట్టారు. దేశంలోని వాహనాల ఫిట్‌నెస్‌కు ప్రత్యేక పరీక్ష విధానం అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
New Delhi, Feb 1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ (Union Budget 2021) ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర లభించింది. చేతిలో రాజముద్రతో ఉన్న బ్యాగులో ట్యాబ్ తీసి ఆమె నెవర్ బిఫోర్ బడ్జెట్ (Budget like never before) గురించి ప్రసంగించారు. లాక్‌డౌన్ వల్ల అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దేశంలో కనీవినీ ఎరుగని పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని వ్యాఖ్యానించారు.
కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చే పథకాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశ పెట్టారు. దేశంలోని వాహనాల ఫిట్‌నెస్‌కు ప్రత్యేక పరీక్ష విధానం అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ల కాల పరిమితి విధించారు. 20 ఏళ్లు దాటిన అన్ని వాహనాలకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించాలనే నిబంధనను తీసుకొచ్చారు. 20 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చేయాలని నిర్ణయించారు. వాయు కాలుష్యం నివారణకు బడ్జెట్‌లో రూ. 2,217 కోట్లను కేటాయించారు.
విద్యుత్ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్న పంపిణీ సంస్థలను తీసుకొస్తామని పేర్కొన్నారు. మూడు లక్షల కోట్ల వ్యయంతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యుత్‌తో ముడిపడి వున్న మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠం చేయడానికే ఈ నిర్ణయమని పేర్కొన్నారు.
వీటితో పాటు హైడ్రోజన్ ప్లాంట్‌ను కూడా నిర్మిస్తామని అన్నారు. విద్యుత్ రంగంలో పీపీఈ మోడల్ కింద అనేక ప్రాజెక్టులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దేశంలో వ్యాపార నౌకలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని, ఇందుకు గాను రూ.1624 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నౌకల రీసైక్లింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు నిర్మలా సీతరామన్ తెలిపారు.
కేంద్ర బడ్జెట్-2021లో (Union Budget 2021 Highlights) సౌరశక్తికి వెయ్యి కోట్ల కేటాయింపులు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది గతేడాది కేటాయింపులతో పోల్చితే చాలా తక్కువ. గతేడాది ఏకంగా 2,516 కోట్లు కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే 2019 బడ్జెట్‌లో రూ.2,280 కో్ట్లు కేటాయింపులు చేయగా.. దానిని 2020లో రూ.10.35 పెంచారు. కానీ ఈ ఏడాది మాత్రం భారీగా కోత విధించి కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది.
మరో కోటి మందికి ‘ఉజ్వల’ పథకాన్ని విస్తరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాలకు ఇంటింటికీ గ్యాస్‌ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో నూతనంగా గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రారంభిస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
రుణ వసూళ్లలో ఇబ్బందులతో నిరర్థక రుణాలు పేరుకుపోయి సమస్యల్లో కూరుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఊరట కల్పించారు. 2021-22 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ 20,000 కోట్లు రీక్యాపిటలైజేషన్ కోసం కేటాయించారు. ఇక ఒత్తిడి ఎదుర్కొంటున్న బ్యాంకుల్లో డిపాజిట్‌దారుల ప్రయోజనాలు కాపాడతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వృద్ధిని ఉత్తేజపరుస్తూ, మౌలిక రంగంలో భారీ వ్యయంతో బడ్జెట్‌కు కొత్త రూపు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు.
భారతీయ జీవిత బీమా సంస్థ.. త్వరలో ఐపీవోకు వెళ్లనున్నది. అయితే దీని కోసం కావాల్సిన సవరణను త్వరలో పార్లమెంట్‌లో తీసుకురానున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇవాళ ఆమె లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ మట్లాడారు. పెట్టుబడులు ఉపసంహరణలో భాగంగా.. పలు బ్యాంకులను, బీమా సంస్థలను బలోపేతం చేయనున్నట్లు ఆమె తెలిపారు. జీవిత బీమా సంస్థ షేర్లను పబ్లిక్‌గా అమ్మనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే దీని కోసం కావాల్సిన చట్ట సవరణను చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సుమారు 1.75 లక్ష కోట్లు ఈ వార్షిక ఏడాదిలో రాబట్టనున్నట్లు ఆమె తెలిపారు.
భారతీయ రైల్వేస్‌కు రికార్డు స్థాయిలో ఈ ఏడాది బడ్జెట్‌ను కేటాయించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని లోక్‌సభలో ప్రకటించారు. 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో రైల్వేస్ కోసం 1,10,055 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఆ మొత్తంలో మూల ధన వ్యయం కోసం 1,07,100 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2030 కోసం భారతీయ రైల్వే శాఖ జాతీయ ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు.
లాజిస్టిక్ వ్యయాన్ని తగ్గించేందుకు ఆ ప్రణాళిక దోహదపడుతుందని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా మెట్రో సేవల విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. మెట్రో లైట్, మెట్రో నియోలను అమలు చేయనున్నట్లు తెలిపారు. శుద్ధ ఇంధనం కోసం హైడ్రోజన్ ఎనర్జీ మిషన్‌ను మొదలుపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 18 వేల కోట్లతో పబ్లిక్ బస్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ స్కీమ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఉజ్వల స్కీమ్ కింద మరో కోటి మందికి వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌కు మరో వంద పట్టణాలను కలపనున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు.
బడ్జెట్ కీ పాయింట్స్
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20 వేల కోట్లు
రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ. 2 లక్షల కోట్లు
విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ వ్యవస్థలు
డిస్కమ్ లకు రూ. 3,05,984 కోట్ల సాయం
హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి సారించనున్నాం
ఇండయన్ షిప్పింగ్ కంపెనీకి రూ. 1,624 కోట్లు
నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంపు
బీమా రంగంలో ఎఫ్డీఐల శాతం 49 నుంచి 74 శాతానికి పెంపు
త్వరలోనే ఎల్ఐసీ ఐపీఓ
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు అదనంగా రూ. 20 వేల కోట్ల సాయం
2022 నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ రవాణా కారిడార్ ఏర్పాటు
రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ. 1,01,055 కోట్లు
2023 నాటికి రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి
దేశ వ్యాప్తంగా విశాఖ సహా ఐదు చోట్ల ఆధునిక ఫిషింగ్ హార్బర్లు
చెన్నై, విశాఖల్లో మేజర్ హార్బర్లు
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్ల ఆదాయం
మంది ఆర్థిక వవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు. ఇక నుంచి బ్యాంకుల ఎన్పీఏలను నిర్వహించనున్న బ్యాడ్ బ్యాంక్.
వ్యవసాయ రంగానికి రూ. 75,100 కోట్లు
వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 16.50 లక్షల కోట్లు
రూ. 40 వేల కోట్లతో గ్రామీణ మౌలిక వసతులు
వన్ నేషన్-వన్ రేషన్ తో 69 కోట్ల మందికి లబ్ధి
మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 15,700 కోట్లు
దేశ వ్యాప్తంగా 15 వేల ఆదర్శ పాఠశాలలు, 100 సైనిక్ స్కూళ్లు
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచాం
అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం
లాక్‌డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యం ఇచ్చాం
జల జీవన్ మిషన్‌కు రూ. 2,87,000 కోట్లు కేటాయింపు
కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం రూ. 35,400 కోట్లు
పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం
వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ
6 సంవత్సరాలకు గాను రూ. 64,180 కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ యోజన పేరుతో కొత్త పథకం
నేషనల్ డిసీజ్ కంట్రోల్ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు
ఆరోగ్య రంగానికి పెద్దపీట
100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం
కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం
మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్
కొత్తగా బీఎస్‌ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు
వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి
రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు
2 కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్
రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
రైతుల సంక్షేమానికి పెద్ద పీఠ
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ . 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ధేశించినట్టు తెలిపారు. గ్రామీణ మౌలిక నిధికి కేటాయింపులను రూ . 40,000 కోట్లకు పెంచామని చెప్పారు. ఇక గత ఏడాది గోధుమల కనీస మద్దతు ధర కోసం రూ. 75,000 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. దీంతో 43 లక్షల మందికి పైగా గోధుమలు పండించే రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది
వసాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపు
2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ
కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించాం
తద్వారా 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు
రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40వేల కోట్లు
తయారీ రంగ అభివృద్ధికి ప్రత్యేకమైన ఆర్థిక సంస్థ ఏర్పాటు
విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు
పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి రూ.2,200 కోట్లు
ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు
జమ్మూకశ్మీర్‌లో గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు
కొత్తగా మరో 100 జిల్లాల్లో గ్యాస్ పంపిణీని పటిష్టం చేస్తాం
సొలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రూ.వెయ్యి కోట్లు
బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు
బ్యాంకుల నిరర్ధక ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం
మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు
ఇక నుంచి బ్యాంకుల ఎన్‌పీఏలు బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయింపు
ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు
బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి పెంపు
2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ
2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు
రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు
2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
జల జీవన్ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు
కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం 35వేల,400 కోట్లు
మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్
కొత్తగా బీఎస్‌ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)