PM E Drive Scheme: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త స్కీం, EV అంబులెన్సుల కోసం ప్రతీక ప్రోత్సహకాలు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ రివల్యూషన్‌ ఇన్నోవేటివ్‌ వెహికల్‌ ఎన్‌హాన్స్‌మెంట్ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Narendra Modi Cabinet

New Delhi, SEP 11: ఈ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఈ-త్రీ వీలర్స్‌, 14,028 ఈ-బస్సులకు సపోర్ట్‌ ఇవ్వనున్నది. పీఎం ఈ డ్రైవ్‌ 88,500 ఛార్జింగ్‌ సైట్లకు తోడ్పాటు ఇవ్వనున్నదని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. కొత్త పథకం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్స్‌, ఇతర అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EVs) ప్రోత్సహించడానికి రూ.3,679 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించనున్నది.

MG Windsor EV: ఎంజీ మోటార్స్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్ విడుదల, కేవలం రూ.10 లక్షలకే మార్కెట్లోకి... 

రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రజా రవాణా సంస్థల ద్వారా 14,028 ఈ-బస్సుల సేకరణకు రూ.4,391 కోట్లు.. ఈ-అంబులెన్స్‌ల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించారు. రోగుల తరలించేందుకు ఈ-అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం చొరవ తీసుకున్నది. ఈ-ట్రక్కుల స్వీకరణను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు అందించారు. కేంద్రం 2015లో ఫేమ్‌ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif