MG Windsor EV

Mumbai, SEP 11: బ్రిటిష్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ మోటార్స్ (MG Motors) భారత మార్కెట్‌లోకి మరో ఈవీ కార్‌ను (EV Car) బుధవారం లాంచ్‌ చేసింది. ఈ ఈవీ కార్‌ రూ.9.99లక్షల ప్రారంభ ధరతో కంపెనీ విడుదల చేసింది. ఇది ఎక్స్‌షోరం ధరమాత్రమే. జెడ్‌ఎస్‌ ఈవీ (ZSE EV), కామెట్‌ ఈవీ తర్వాత మూడో ఎలక్ట్రిక్‌ కారు విండోసోర్‌ (MG Windsor EV) కావడం విశేషం. కొత్తగా బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ (BAAs‌) ప్రోగ్రామ్‌ని సైతం ఎంజీ ప్రారంభించింది. ఇందులో కిలోమీటర్‌కు రూ.3.5 చొప్పున చెల్లించి బ్యాటరీని తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక కారు అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ అక్టోబర్‌ 3న మొదలై.. 12 నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Here is details

 

ఎంజీలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ వాటాలు కొనుగోలు చేసిన అనంతరం విడుదల చేసిన తొలి ఈవీ ఇదే. జెడ్‌ఎస్‌ ఈవీ, కామెట్‌ ఈవీలకు భిన్నంగా మిడ్‌సైజ్‌ క్రాసోవర్‌ డిజైన్‌లో కంపెనీ రూపొందించింది. అత్యాధునిక ఫీచర్స్‌తో పాటు ప్రయాణికులకు విశాలమైన స్పేస్‌ని ఆఫర్‌ చేసినట్లు కంపెనీ చెప్పింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈవీ కార్లతో పోలిస్తే విండ్‌సోర్‌ డిజైన్‌ భిన్నంగా ఉంటుంది. లుక్స్‌లో ఉలుంగ్‌ క్లౌడ్‌ ఈవీ తరహాలో రూపొందించగా.. భారత్‌లో అవసరమైన పలు మార్పులు చేసి ప్రత్యేకంగా గుర్తింపును తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ కారు చైనా వులింగ్‌ క్లౌడ్‌ ఈవీ రీ బ్రాండెడ్‌ వెర్షన్‌. ఇది ఎంపిక చేసిన గ్లోబల్‌ మార్కెట్లలో అందుబాటులో ఉన్నది. ఇక ఎండీ విండ్‌సోర్‌ ఈవీ 134 బీహెచ్‌పీ, 200 ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్‌ మోటార్‌ ఉంటుంది.

Hyundai Creta EV: హ్యుండాయ్ క్రెటా ఈవీ లాంచ్ తేదీ వచ్చేసింది, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయంటే.. 

దాంతో వెనుకవైపు సౌకర్యవంతంగా ఉంటాయి. 18 అంగుళాల డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, ఫ్రంట్‌ ఛార్జింగ్‌ ఇన్‌లెట్‌ లైట్స్‌, వెనుక భాగంలో ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్‌ యూనిట్స్‌తో వస్తుంది. దీనికి ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. కారులో ముందుభాగంలోని సీట్లు విమానాల్లో ఫస్ట్‌క్లాస్‌ సెక్షన్‌ తరహాలో 135 డిగ్రీల్లో వాల్చుకునే అవకాశం ఉంది.

వాహనంలో అన్ని సీట్లలో భారీగా కుషన్‌ని వాడారు. ఇక పనోరమిక్‌ సన్‌రూఫ్‌, ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ సిస్టమ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. 8.8 అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లే, 15.6 అంగుళాల మేయిన్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ స్క్రీన్‌ ఈవీకి లగ్జరీ లుక్స్‌ను తెచ్చిపెట్టాయి. ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేని సపోర్ట్‌ చేయనున్నాయి. లెవెల్ 2 ఏడీఏఎస్‌, 360 డిగ్రీస్‌ కెమెరా, 9 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ మరెన్నో ఫీచర్లు సైతం ఉన్నాయి. ఈ కారులో 600 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను ఉంటుంది. ఈ కారు టాటా ఈవీ కర్వ్‌, టాటా నెక్సాన్‌ ఈవీ మాక్స్‌, మహీంద్రా ఎక్స్‌యూవీతో పోటీ పడనున్నది.