Unlock 2 Guidelines: రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ, జూలై 31వరకు అన్‌లాక్‌-2 నిబంధనలు అమల్లోకి.., అన్‌లాక్‌-2 విధివిధానాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం అన్‌లాక్‌-2 విధివిధానాలు (Unlock 2 Guidelines) ప్రకటించింది. కేంద్ర హోం శాఖ (Home ministry) ఈ మేరకు పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. జూలై 31వరకు అన్‌లాక్‌-2 (Unlock 2) నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే కంటైన్‌మెంట్‌ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌ (Lockdown) పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

COVID-19 lockdown in India | (Photo Credits: IANS)

New Delhi, June 29: కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రభుత్వం (Central Govt) దశలవారీగా సడలిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం అన్‌లాక్‌-2 విధివిధానాలు (Unlock 2 Guidelines) ప్రకటించింది. కేంద్ర హోం శాఖ (Home ministry) ఈ మేరకు పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. జూలై 31వరకు అన్‌లాక్‌-2 (Unlock 2) నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే కంటైన్‌మెంట్‌ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌ (Lockdown) పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. నేడు ప్రధాని ప్రసంగం ఆ రెండింటి మీదనేనా ? సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ, కోవిడ్-19, బార్డర్ ఘర్షణలే ఇప్పుడు హాట్ టాఫిక్..

దేశవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, మెట్రో రైలు సర్వీసులు, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. తాజ్‌హోట‌ల్‌ను బాంబులతో పేల్చేస్తాం, లష్కరే తోయిబా ఉగ్రవాదుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్, అప్రమత్తమైన ముంబై పోలీసులు

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించనున్నట్టు స్పష్టం చేసింది. మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌ కూడా జులై 31 వరకు మూసివేత కొనసాగుతుందని తెలిపింది. పెళ్లయిన 2 రోజులకే వరుడిని కరోనా కాటేసింది, బీహార్‌లో పెళ్లికి వచ్చిన వారిలో 95 మందికి కోవిడ్-19, దేశంలో తాజాగా 18,522 పాజిటివ్ కేసులు నమోదు

దశలవారీగా ఆంక్షలను సడలించేందుకు విధించిన అన్‌లాక్‌–1 గడువు మంగళవారంతో ముగియనుండగా ఈ మేరకు సోమవారం రాత్రి హోం శాఖ అన్‌లాక్‌–2 మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి అందిన సమాచారం మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపింది. కంటెన్మెంట్ జోన్లలో కోవిడ్‌–19 వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా ఈ జోన్ల పరిధిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే నిర్ణయించాల్సి ఉంటుందని, ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో అత్యవసర సేవలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.