UP Shocker: యూపీలో దారుణం,నాతో పడుకోకుంటే ఆఫ్తాబ్‌ మాదిరిగా ముక్కలుగా నరికేస్తానని బెదిరింపులు, రెండేళ్ల నుంచి విద్యార్థినులపై కంప్యూటర్ టీచర్ అత్యాచారం, నిందితుడు అరెస్ట్

కంప్యూటర్ పాఠాలు చెప్పే టీచర్‌ రెండేళ్లుగా విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే శ్రద్ధా వాకర్‌ గతే ఆమెకు పడుతుందని హెచ్చరించాడు

Man thrashes wife for failing to conceive a child (Representational: Getty)

Ghaziabad, Dec 8: యూపీలో ఘజియాబాద్ జిల్లాలో దారుణం (UP Shocker) చోటు చేసుకుంది. కంప్యూటర్ పాఠాలు చెప్పే టీచర్‌ రెండేళ్లుగా విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే శ్రద్ధా వాకర్‌ గతే ఆమెకు పడుతుందని హెచ్చరించాడు.నేను ఆఫ్తాబ్‌ మాదిరిగా మారి నిన్ను ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిన ఆ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.

తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు, వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వారు ఫిర్యాదు ప్రకారం.. 32 ఏళ్ల కంప్యూటర్‌ టీచర్‌ సౌరభ్ గుప్తా, రెండేళ్ల కిందట మార్కుల పేరుతో 9వ తరగతి విద్యార్థిని (teacher arrested for raping minor girl) లోబరచుకున్నాడు. ఆమె ఎదురుతిరిగినప్పుడల్లా ఫెయిల్‌ చేస్తానని బెదిరించాడు. ఆ బాలికపై రెండేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే శ్రద్ధాను ఆఫ్తాబ్‌ హత్య చేసిన మాదిరిగా ముక్కలుగా నరికి చంపుతానని హెచ్చరించాడు.

గుంటూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని బ్లేడుతో యువతి గొంతు కోసి తన చేతిని కోసుకున్న ప్రేమోన్మాది, చికిత్స పొందుతూ యువతి మృతి

టీచర్‌ వార్నింగ్‌తో ఆ బాలిక భయపడింది. లైంగిక దాడితోపాటు అతడి బెదిరింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీచర్‌ సౌరభ్‌ గుప్తాపై పలు సెక్షన్లతోపాటు పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా సూరజ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైత్‌పూర్ గ్రామంలో ఇంట్లో ఉన్న అతడ్ని ఆదివారం అరెస్ట్‌ (Computer teacher arrested) చేశారు.

విశాఖలో డ్రమ్ములో ముక్కలు ముక్కలుగా నరికిన యువతి మృతదేహం, భర్తే నరికి డ్రమ్ములో దాచిపెట్టాడనే అనుమానాలు, ఏడాది తర్వాత దారుణ ఘటన వెలుగులోకి..

మరోవైపు ఫెయిల్‌ చేస్తానని బెదిరించి పలువురు విద్యార్థినులను కూడా లొంగదీసుకున్నట్లు ఆ టీచర్‌ దర్యాప్తులో తెలిపాడు. ఈ నేపథ్యంలో సోమవారం నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.