UP Shocker: తాగిన మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం, మరో చోట 98 ఏళ్ల వృద్ధురాలిపై మరో వ్యక్తి లైంగిక దాడి, యూపీలో దారుణ ఘటనలు

ఓ వ్యక్తి తాగిన మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ( Drunk man rapes 70-year-old in Fatehpur) పాల్పడ్డాడు.మరో జిల్లా బల్లియాలో 98 ఏళ్ల వృద్ధురాలిపై మరో వ్యక్తి అత్యాచారానికి ( rape attempt on 98-year-old in Ballia) యత్నించాడు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Fatehpur, August 31: ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాగిన మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ( Drunk man rapes 70-year-old in Fatehpur) పాల్పడ్డాడు.మరో జిల్లా బల్లియాలో 98 ఏళ్ల వృద్ధురాలిపై మరో వ్యక్తి అత్యాచారానికి ( rape attempt on 98-year-old in Ballia) యత్నించాడు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఓ 70 ఏళ్ల యాచకురాలు తరిణవ్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాల భవనంలో నిద్రించేది.ఈ క్రమంలో ఆదివారం రాత్రి లక్ష్మీ లోధి(32) మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ దారుణ ఘటనలో కేసు నమోదు చేసిన తర్వాత నిందితుడిని అరెస్టు చేశామని, మహిళను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపినట్లు తరిణవ్ పోలీస్ స్టేషన్ SHO నందలాల్ సింగ్ చెప్పారు.

అంతే కాకుండా బల్లియా జిల్లాలో 22 ఏళ్ల వ్యక్తి 98 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఆగస్టు 20న సోను అనే నిందితుడు తనపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రూంలో ఒంటరిగా..సెక్స్ వీడియోలకు బానిసైన బాలిక, తన న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్, వాటిని చూసిన తల్లిదండ్రులకు గుండెపోటు, గుజరాత్‌లో విషాద ఘటన

ఇక ఈ ఘటనపై మొదట కేసు నమోదు చేయడానికి నిరాకరించారని, కానీ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్షలు రావడంతో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులు అన్నారు.