Ahmedabad, August 30: గుజరాత్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆన్ లైన్ క్లాసులో పేరుతో బాలికను ఒంటరిగా రూంలో తల్లిదండ్రులు వదిలేయడంతో ఆ అమ్మాయి పోర్న్ వీడియోలకు బానిస అయింది. అవి చూస్తూ తన వీడియోలను కూడా ఆయా వెబ్ సైట్లలో పోస్ట్ (15-year-old girl posts nude selfies in Social Media) చేసింది. ఈ వీడియోలను చూసిన తల్లిదండ్రులకు గుండెపోటు (parents suffer heart attacks) వచ్చింది. గుజరాత్‌లోని అహమ్మదాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు (Ahmedabad) చెందిన బాలిక (15)కు తల్లిదండ్రులు ఆన్‌లైన్ క్లాసుల కోసం కొన్నిరోజుల కిందట స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి బాలిక ఆన్‌లైన్ క్లాసులు వింటోంది. ఆన్‌లైన్ క్లాసుల కోసం ఆ బాలికను తల్లిదండ్రులు ప్రత్యేకంగా గదిని కేటాయించారు. ఈ ప్రత్యేక గదిలో ఆన్‌లైన్ క్లాసులు వింటున్న సమయంలో ఓ వైబ్‌సైట్ కనిపించింది. అది తెరచి చూడగా మొత్తం నగ్న వీడియోలు, చిత్రాలు ఉన్నాయి.
వాటిని చూడడం ప్రారంభించిన బాలిక వాటికి కామెంట్లు కూడా చేయడం కూడా అలవాటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో కొందరితో పరిచయమైంది. వారు బాలికకు నీ వీడియో కూడా పెట్టు అని బలవంతం చేయడంతో ఒకరోజు బాలిక తన నగ్న వీడియో, ఫొటోలను ఆ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. ఆ వీడియోకు స్పందన బాగా వచ్చింది. దీంతో ఆ అమ్మాయి తమ బంధువుల పిల్లలకు కూడా ఆ వెబ్‌సైట్‌ను ఫాలో కావాలని.. మీరు కూడా ఫొటోలు, వీడియోలు పంచుకోవాలని చెప్పింది.
బిత్తరపోయిన సదరు పిల్లలు వెంటనే ఈ విషయం వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చీవాట్లు పెట్టి ఈ బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. వారు వాటిని చూడగా తమ కుమార్తె నగ్న వీడియో కనిపించింది. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. బంధువుల సహాయంతో వారు ఆస్పత్రిలో చేరారు. అనంతరం బాలికను వీడియో గురించి ఆరా తీయగా జరిగన విషయాలు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే తేరుకుని దీనిపై 181 కు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలికకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఆ వెబ్ సైట్ నుండి తొలగించేశారు.