Fight For Rasgullas: పెళ్లి భోజనంలో రసగుల్లాలు వడ్డించలేదని తన్నుకున్న భోజన ప్రియులు, ఆరుమందికి తీవ్ర గాయాలు, ఆగ్రాలో విచిత్రకర ఘటన
స్థానిక శంషాబాద్ ప్రాంతం లో ఆదివారం రోజు ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వివాహ వేడుకల్లో వచ్చిన అతిథులకు పసందైన వంటకాలు చేసి వడ్డించారు. అయితే కొద్దిసేపట్లోనే వడ్డించిన రసగుల్లాలు మొత్తం అయిపోయాయి. కొంతమందికి ఆ రసగుల్లాలు అందలేదు.
Rasgullas Fight Agra Wedding Function : పెళ్లిళ్లు అంటేనే ఎంతో హడావుడితో ఉంటాయి. బంధువుల సందడి, చిన్నారుల అల్లర్లతో పెళ్లి మండపాలన్నీ సంతోషకరమైన వాతావరణంతో మునిగి తేలుతుంటాయి..ముందుగా మనకు పెళ్లి అంటే అందరికి గుర్తొచ్చేది పసందైన వంటకాలే. ఈ వేడుకల్లో రకరకాలైన వంటకాలు చేసి వచ్చిన అతిథులకు వడ్డిస్తారు. ఒక్కొక్కసారి అయితే జనం ఎక్కువయితే కొంత ఆహారం కొరత కూ డా ఏర్పడుతుంది. తాజాగా ఓ విచిత్ర సంఘటన ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకుంది. అక్కడ రసగుల్లాల కోసం పెళ్లికి వచ్చిన అథిధులు కొట్టుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో చోటు చేసుకుంది.
ఘటన వివరాల్లోకి వెళితే.. స్థానిక శంషాబాద్ ప్రాంతం లో ఆదివారం రోజు ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వివాహ వేడుకల్లో వచ్చిన అతిథులకు పసందైన వంటకాలు చేసి వడ్డించారు. అయితే కొద్దిసేపట్లోనే వడ్డించిన రసగుల్లాలు మొత్తం అయిపోయాయి. కొంతమందికి ఆ రసగుల్లాలు అందలేదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రసగుల్లాలు అందకపోవడంతో వడ్డించేంవారిపై చిందులు తొక్కాడు. ఇది కాస్తా కొంత ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీస్ అధికారి అనిల్ శర్మ తెలిపారు.
పట్టపగలే అందరూ చూస్తుండగా.. ఓ యువతి కిడ్నాప్, సోషల్ మీడియాలో వీడియో వైరల్.
క్షతగాత్రులను భగవాన్ దేవి, యోగేష్, మనోజ్, కైలాష్, ధర్మేంద్ర, పవన్ గా గుర్తించారు. వారిని వెంటనే చికిత్సానంతరం స్థానిక ఆసుపత్రికి తరలిచారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కాగా గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఎత్మాద్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుకలో మిఠాయిల కొరత విషయమై జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)