మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో సోమవారం షాకింగ్ సంఘటన జరిగింది. ఝాన్సీ రోడ్ బస్టాండ్ వద్ద ఓ మహిళ కిడ్నాప్ అయింది. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు ఆ మహిళను కిడ్నాప్ చేసిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. రద్దీగా ఉండే ఝాన్సీ రోడ్ బస్టాండ్ లో దృశ్యాలు సీసీటీవి కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
ఆ బాధితురాలును భింద్ కు చెందిన మహిళగా గుర్తించారు. ఆ మహిళ బస్సు నుండి దిగిన వెంటనే.. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఆమెను బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని.. మరో వ్యక్తి ముఖం కనిపించకుండా గుడ్డ కట్టుకొని బలవంతంగా మహిళను ఎత్తుకొని బైక్ పై కూర్చొబెట్టుకున్నాడు. అక్కడ ఉన్న చుట్టూ పక్కల వారు చూస్తుండగానే అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.
Here's Video
मध्य प्रदेश के #Gwalior में युवती का नकाबपोश 2 बदमाशों ने किया अपहरण, घटना CCTV में कैद pic.twitter.com/EBy5Ebi72b
— NDTV India (@ndtvindia) November 20, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)