Uttar Pradesh: యూపీలో దారుణం, తల్లిని తుఫాకీతో కాల్చి రెండు రోజులు శవాన్ని ఇంట్లో దాచిపెట్టిన మైనర్ బాలుడు, ఎవరికైనా చెబితే చంపేస్తానని చెల్లెలికి బెదిరింపులు, మైనర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్జీ ఆడకుండా అడ్డుకున్నందుకు ఏకంగా తన తల్లినే కాల్చి చంపాడు ( Lucknow boy kills mother) ఓ మైనర్ బాలుడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది.

Image used for representation purpose only | Photo: PTI

Lucknow, June 8: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్జీ ఆడకుండా అడ్డుకున్నందుకు ఏకంగా తన తల్లినే కాల్చి చంపాడు ( Lucknow boy kills mother) ఓ మైనర్ బాలుడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల కొన్ని నెలలుగా ఓ మైనర్‌ బాలుడు ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్జీని ఆడటం ప్రారంభించాడు. అయితే రాను రాను అన్ని పనులను, చదువుని పక్కన పెట్టి ఈ గేమ్‌ను ఆడుతూ ఉండేవాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి అతడిని పబ్జీ ఆడవద్దని సూచించేది.

అయితే బాలుడు ఆడుతున్న ప్రతి సారి తన తల్లి గేమ్‌ వద్దని (letting him play online game) వారించడంతో కోపంతో ఊగిపోయాడు. దీంతో బాలుడు క్షణికావేశంలో తన తండ్రి పిస్టల్‌ తీసుకుని తల్లిని కాల్చి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని రెండు రోజులు ఇంట్లో దాచిపెట్టాడని పోలీసులు బుధవారం తెలిపారు.ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాలుడు తన తల్లిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని గదిలో దాచిపెట్టి (hides body for two days), తన చెల్లెలిని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని పోలీసు అధికారులు తెలిపారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, జువైనల్ హోంకు తరలించనున్నట్లు వారు తెలిపారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం బాలుడి తండ్రి ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో డ్యూటీ చేస్తున్నారు.

వీళ్లు పోలీసులేనా..కస్టడీలో ఉన్న వ్యక్తిని లాఠీలతో ప్రైవేట్‌ భాగాలపై కొట్టడంతో పాటు విద్యుత్‌ షాక్‌లు, పోలీసులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు

అయితే ఆదివారం సాయంత్రం, కొంత డబ్బు పోవడంతో తల్లీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. తర్వాత దొరికిన డబ్బును దొంగిలించాడని ఆమె ఆరోపించింది. తప్పు చేయనప్పుడు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతను గేమ్ ఆడటానికి మొబైల్ ఫోన్‌ని ఉపయోగించకుండా ఆపినందుకు తన తల్లిపై అతను కోపం పెంచుకున్నాడు. అల్మారాలో తన తండ్రి పిస్టల్ ఎక్కడ ఉంచబడిందో అతనికి తెలుసు. వెంటనే దానిని తీసుకుని తల్లి తలపై కాల్చి చంపాడు. రెండు రోజులుగా ఎవరికీ చెప్పకుండా బయటి నుంచి చెల్లెలుకు భోజనం తెచ్చాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. వాసనను దాచేందుకు రూమ్‌ ఫ్రెషనర్‌ వాడాడు' అని ఏడీసీపీ తెలిపారు.