Luknow, June 6: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఓ వ్యక్తిపై కిరాతకంగా ప్రవర్తించారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని చిత్రహింసలు పెట్టి విద్యుత్ షాక్‌లు (Electric Shocks In Custody) ఇచ్చిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు (Action Against UP Cops) తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్‌లో ఈ దారుణం జరిగింది. మే 2న పశువుల చోరీకి సంబంధించిన కేసులో 20 ఏళ్ల రోజువారీ కూలీ అయిన రెహాన్‌ను బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ కస్టడీలో చిత్ర హింసలు పెట్టారు. లాఠీలతో ప్రైవేట్ భాగాలపై కొట్టడంతో (Man Violated With Stick) పాటు విద్యుత్ షాకులు ఇచ్చారు. చివరకు రెహాన్ కుటుంబం నుంచి రూ.5,000 లంచం తీసుకుని ఆరోగ్యం క్షీణించిన అతడ్ని విడిచిపెట్టారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన రెహాన్‌ను అతడి కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రభుత్వ వైద్యులు చేతులెత్తేయడంతో మెరుగైన వైద్యం కోసం బులంద్‌షహర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బదౌన్ పోలీస్ స్టేషన్‌లో కస్టడీ చిత్ర హింసలపై రెహాన్ కుటుంబ సభ్యులు మీడియా ఎదుట వాపోయారు. పోలీసులు కర్రలతో ప్రైవేట్ భాగాలపై కొట్టడంతో పాటు కరెంట్ షాకులు ఇచ్చారని ఆరోపించారు.
తీవ్రంగా గాయపడిన అతడ్ని చివరకు లంచం తీసుకుని విడిచిపెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ సంఘటన పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారిపై నేర సంబంధ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు