Uttar Pradesh: బదిలీ కావాలని అడిగిన ఉద్యోగి, నీ భార్యను రాత్రికి నా దగ్గరకు పంపితే చూద్దామన్న పై అధికారి, తట్టుకోలేక ఒంటిపై డీజిల్‌పోసుకుని నిప్పంటించుకున్న బాధితుడు, చికిత్స పొందుతూ మృతి

ఓ ఉద్యోగి తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారిని అడగగా... బదిలీ కావాలంటే నీ భార్యను ఓ రాత్రికి నా దగ్గరకు పంపమని షరతు పెట్టాడు. దీంతో సదరు ఉద్యోగి (Uttar Pradesh Man) తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి (Kills Himself) పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Representational Image (Photo Credits: ANI)

Lakhimpur, April 11: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఉద్యోగి తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారిని అడగగా... బదిలీ కావాలంటే నీ భార్యను ఓ రాత్రికి నా దగ్గరకు పంపమని షరతు పెట్టాడు. దీంతో సదరు ఉద్యోగి (Uttar Pradesh Man) తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి (Kills Himself) పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలో గోకుల్ ప్రసాద్(45) అనే ఉద్యోగి విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, అతను ప్రతీరోజు లఖింపూర్‌ నుంచి అలీగంజ్‌కు ప్రయాణం చేసి ఉద్యోగం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరాడు. ఆ సమయంలో జూనియర్‌ ఇంజినీర్‌.. నీకు ట్రాన్స్‌ఫర్‌ కావాలంటే నీ భార్యను ఓ రాత్రికి తన వద్దకు పంపమని (Send Wife For A Night) అడిగాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గోకుల్‌.. ఆఫీసు బయట ఒంటిపై డీజిల్‌పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం తోటి ఉ‍ద్యోగులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

యువతిపై ప్రియుడు లైంగికదాడి, ఆ దారుణాన్ని వీడియో తీసిన స్నేహితుడు, ఆ వీడియోతో బెదిరించి 8 మంది బాలికపై సామూహిక అత్యాచారం, ఏడుమందిని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు

ఈ నేపథ్యంలో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా నిందితులు గత మూడేళ్లుగా గోకుల్‌ను చిత్రహింసలకు గురిచేస్తున్నారని భార్య ఆరోపించింది. దీంతో అతను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని, అయినా వారు మాత్రం అతనిని విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూనియర్‌ ఇంజినీర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనతో జూనియర్‌ ఇంజినీర్‌, క్లర్క్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు.