Uttar Pradesh Shocker: తండ్రి రూపంలో కీచక కామాంధుడు..కూతురును కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా అత్యాచారం, నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన మధుర కోర్టు, శిక్షతగ్గించాలన్న నిందితుడి అభ్యర్ధనను తిరస్కరించిన ప్రత్యేక పోక్సో కోర్టు
ఓ కామాంధుడైన తండ్రి (Uttar Pradesh Shocker) మైనర్ బాలికైన (15)సవతి కూతురిపై కన్నేశాడు. అదును చూసి ఆమెను కిడ్నాప్ చేసి ఆపై లైంగిక దాడికి (Mathura man abducts, rapes minor stepdaughter) పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో నిందితుడికి యూపీలోని మధుర కోర్టు యావజ్జీవ శిక్ష (sentenced to life term till death) విధించింది.
Lucknow, August 14: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడైన తండ్రి (Uttar Pradesh Shocker) మైనర్ బాలికైన (15)సవతి కూతురిపై కన్నేశాడు. అదును చూసి ఆమెను కిడ్నాప్ చేసి ఆపై లైంగిక దాడికి (Mathura man abducts, rapes minor stepdaughter) పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో నిందితుడికి యూపీలోని మధుర కోర్టు యావజ్జీవ శిక్ష (sentenced to life term till death) విధించింది.
ఇది తన తొలి నేరం కావడంతో శిక్షను తగ్గించాలన్న నిందితుడి అభ్యర్ధనను ప్రత్యేక పోక్సో కోర్టు తోసిపుచ్చింది. బాధితురాలు కుటుంబ సభ్యురాలు కావడం, ఆమె వయసు 16 ఏండ్లలోపు ఉండటంతో ఇది తీవ్రాతి తీవ్రమైన నేరమని అదనపు జిల్లా ప్రభుత్వ కౌన్సెల్ సుభాష్ చతుర్వేది పేర్కొన్నారు. మైనర్ బాలికైన సవతి కూతురిపై లైంగిక దాడి అమానుషమని వాదనలు వినిపించారు.నిందితుడికి కోర్టు యావజ్జీవ ఖైదు విధించడంతో పాటు రూ 2 లక్షల జరిమానా విధించింది. నిందితుడు ఆ మొత్తం చెల్లించలేని పక్షంలో ప్రభుత్వమే జరిమానా చెల్లించాలని పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమర్ సింగ్ ఆదేశించారు.
బాలిక తల్లి(48) మొదటి భర్త మరణించడంతో 2013లో మరో వ్యక్తి (38)ని ఆమె పెండ్లి చేసుకుంది. అదే ఏడాది ఫిబ్రవరి 10న ఆమె బంధువుల ఇంటికి వెళ్లగా అదును చూసి అప్పటికి 15 సంవత్సరాల వయసున్న సవతి కూతురిని తీసుకుని నిందితుడు ఉడాయించాడు.