UP Shocker: జామపండు ఇస్తామని బాలికపై గ్యాంగ్ రేప్, మరో చోట తుపాకీతో బెదిరించి యువతిపై అత్యాచారం, మధ్యప్రదేశ్‌లో వేధింపులకు పాల్పడిన యువకుడిని చితకబాదిన యువతి కుటుంబ సభ్యులు
ముజఫర్‌నగర్ సమీపంలోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఇద్దరు నిందితులు యువతి(17)పై ఆదివారం సామూహిక లైంగిక దాడికి (17-year-old gang-raped in UP) పాల్పడ్డారు. వీరు నేరాన్ని వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో (video shared on social media) ఈ దారుణం వెలుగుచూసింది.
Lucknow, Sep 21: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముజఫర్‌నగర్ సమీపంలోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఇద్దరు నిందితులు యువతి(17)పై ఆదివారం సామూహిక లైంగిక దాడికి (17-year-old gang-raped in UP) పాల్పడ్డారు. వీరు నేరాన్ని వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో (video shared on social media) ఈ దారుణం వెలుగుచూసింది. శుభం, ఆశిష్ అనే నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలింపు తీవ్రతరం చేశారు.
బాలికకు జామ పండ్లు ఇస్తామని ఆశ చూపి ఆమెను తోటలోకి తీసుకువెళ్లిన నిందితులు దారుణానికి ఒడిగట్టారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగుచూసిందని పోలీసులు తెలిపారు. ఇక కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో జరిగిన మరో ఘటనలో పొలంలో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడని ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
మధ్య ప్రదేశ్‌లో బాలికను వేధించిన యువకుడికి దేహశుద్ధి: రాష్ట్రంలో బాలికను వేధింపులకు గురి చేసిన ఓ యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 28 ఏండ్ల వయసున్న బల్దౌ జాదవ్.. దోపిడీ కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. తాను నివాసముంటున్న ఏరియాలో ఓ బాలికపై కన్నేసి.. ఆమెను వేధింపులకు గురి చేశాడు. బాలిక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది.
దీంతో జాదవ్‌ను బాలిక కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాదారు. మెడకు బెల్ట్‌ను చుట్టి హింసించారు. నోట్లో నుంచి రక్తం కారేలా కొట్టారు. తాను తప్పు చేశానని, మరోసారి ఇలాంటి పాడు పనులు చేయనని ప్రాధేయపడినప్పటికీ అతన్ని వదిలిపెట్టలేదు. ఈ ఘటనను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. యువకుడిని చితకబాదిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
హర్యానాలో తుపాకీతో బెదిరించి బాలికపై అత్యాచారం: బాలిక అభ్యంతరకర ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరించి తుపాకీ గురిపెట్టి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టిన ఘటన హర్యానాలోని పల్వాల్ జిల్లాలో జరిగింది. జులై 20న జరిగిన ఈ దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు ఓ ముఖ్య విషయం మాట్లాడాలని తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడని, ఆపై గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌కు పిలిపించి రహస్యంగా తన ఫోటోలు తీశాడని బాలిక ఆరోపించింది.
ఆ తర్వాత మరోసారి కలవాలని లేకుంటే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో జులై 20న కారులో గోడౌన్‌కు తీసుకువెళ్లి అక్కడ తుపాకీ గురిపెట్టి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించడంతో బాలిక మౌనం దాల్చింది. కుటుంబ సభ్యులకు ఇటీవల ఈ వ్యవహారం చెప్పడంతో వారు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం గురుగ్రాంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
రాజస్థాన్‌లో కానిస్టేబుల్ కీచక బుద్ధి: మైనర్ బాలికకు అభ్యంతరకర మెసేజ్‌లు, వీడియోలు పంపిన పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ఘటన రాజస్ధాన్‌లోని అజ్మీర్‌లో వెలుగుచూసింది. పిసంగన్ పీఎస్‌లో పనిచేసే నిందితుడు విక్రం సింగ్‌పై ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. సింగ్ గత కొద్ది నెలలుగా బాలికను వేధిస్తున్నాడని నిందితుడిపై ఫిర్యాదు చేసిన పిసంగన్ పంచాయితీ సమితి సభ్యుడు ప్రదీప్ కుమవాత్ వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్ సింగ్‌పై కేసు నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేస్తామని అజ్మీర్ ఎస్పీ జగదీష్ చంద్ర శర్మ తెలిపారు. నసీరాబాద్ సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఈ కేసును విచారిస్తున్నారని పోలీసులు చెప్పారు.