Uttar Pradesh Shocker: చెల్లి పెళ్లికి ఉంగరం బహుమతిగా ఇచ్చిన అన్న, ఎందుకు ఇచ్చావంటూ కోపంతో అతన్ని కొట్టి చంపిన భార్య

చంద్ర ప్రకాష్ మిశ్రా తన సోదరి పెళ్లికి బంగారు ఉంగరం, టెలివిజన్ బహుమతిగా ఇచ్చినందుకు మనస్తాపం చెంది అతని భార్య కుటుంబ సభ్యులు కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.

Representative Image (File Image)

బారాబంకి:ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ పెళ్లి బహుమతి కోసం జరిగిన గొడవ హత్యకు దారితీయడంతో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. చంద్ర ప్రకాష్ మిశ్రా తన సోదరి పెళ్లికి బంగారు ఉంగరం, టెలివిజన్ బహుమతిగా ఇచ్చినందుకు మనస్తాపం చెంది అతని భార్య కుటుంబ సభ్యులు కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏప్రిల్ 26న పెళ్లి జరగనున్న తన సోదరికి బంగారు ఉంగరం,టెలివిజన్ బహుమతిగా ఇవ్వాలని 35 ఏళ్ల అతను కోరుకున్నాడు. అయితే చంద్ర ప్రకాష్ భార్య చాబి, తన భర్త నిర్ణయంతో కలత చెందింది, ఇది దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడైన చాబి తన సోదరులను చంద్ర ప్రకాష్‌కు గుణపాఠం చెప్పమని పిలిపించినట్లు అధికారులు తెలిపారు. గంజాయి మత్తులో యువకుడిపై కత్తితో దాడి చేసిన మరో యువకుడు, వీడియో ఇదిగో..

చాబీ సోదరుడు బావని సుమారు గంటపాటు కర్రలతో కొట్టాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చాబీ, ఆమె సోదరులు సహా ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వారు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif