UP Shocker: వెనక రాడ్డు దూర్చి..ముందర పురుషాంగాన్ని పగలగొట్టి, ప్రేమించినందుకు యూపీలో దారుణ ఘటన, యువకుడిపై అత్యంత తీవ్రంగా దాడి చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు
తమ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడనే కారణంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. నలుగురు కలిసి ఆ యువకుడిని (Youth held captive, tortured by 4 men ) చితకబాదారు. అంతటితో ఆగకుండా జననాంగాలపై తీవ్రంగా దాడి చేశారు. ఆ యువకుడి మలద్వారంలో రాడ్ దించి దారుణంగా వ్యవహరించారు.
Lucknow, April 3: యూపీలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడనే కారణంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. నలుగురు కలిసి ఆ యువకుడిని (Youth held captive, tortured by 4 men ) చితకబాదారు. అంతటితో ఆగకుండా జననాంగాలపై తీవ్రంగా దాడి చేశారు. ఆ యువకుడి మలద్వారంలో రాడ్ దించి దారుణంగా వ్యవహరించారు. ఈ షాక్ ఘటనతో ఆ యువకుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని లక్క్క్ష్మీపూర్ ఖేరీ ప్రాంతంలో 22 ఏళ్ల దళిత యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి బ్రహ్మాదీన్, ఆమె సోదరులు భరత్, గజరాజ్, రాజు ఆ యువకుడిపై దాడి చేసి చితక్కొట్టారు. తీవ్రంగా దాడి చేసి వదిలేయకుండా అమానుషంగా ప్రవర్తించారు. మలద్వారంలో పెద్ద ఇనుప రాడ్ చొప్పించారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
ఈ సమాచారం తెలుసుకున్న బాధిత యువకుడి సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న టికోనియా పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆ యువకుడిపై దాడికి పాల్పడిన తండ్రి బ్రహ్మాదీన్, అతడి ముగ్గురు కుమారులు భరత్, గజరాత్, రాజులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. బాధిత యువకుడు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రాజకీయ రంగును పులుముకునే దిశగా సాగుతోంది.