Vaccine Hesitancy: కరోనా టీకా వేసుకోమంటే భయంతో చెట్టెక్కాడు, భార్య ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లడంతో టీకా వేయించుకోలేకపోయిన అతని భార్య, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పతంకాలన్ గ్రామంలో ఘటన
అయితే ఆయన భార్య టీకా తీసుకోవడానికి అంగీకరించినప్పటికీ.. అతడు ఆమె ఆధార్ కార్డు (Man Climbs Tree With Wife's Aadhaar Card) కూడా తనతో తీసుకెళ్లాడు. దీంతో ఆమె కూడా కరోనా టీకా వేయించుకోలేకపోయింది.
Bhopal, June 26: కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడిన ఓ వ్యక్తి చెట్టెక్కిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో పతంకాలన్ గ్రామంలో చోటు చేసుకుంది.ఘటన వివరాల్లోకెళితే..కోవిడ్ టీకా శిబిరం నిర్వహించడానికి ఆరోగ్య శాఖ బృందం పతంకాలన్ గ్రామానికి వచ్చింది. కరోనా వ్యాక్సిన్ కోసం అందరూ టీకా శిబిరానికి రావాల్సిందిగా గ్రామస్తులందని కోరారు. అయితే గ్రామానికి చెందిన కన్వర్లాల్ అనే వ్యక్తి టీకా కేంద్రానికి వ్యాక్సిన్ కోసం వచ్చాడు
కానీ వ్యాక్సిన్ వేయడం చూసి భయంతో (Avoid COVID-19 Jab) చెట్టెక్కి కూర్చున్నాడు. అయితే ఆయన భార్య టీకా తీసుకోవడానికి అంగీకరించినప్పటికీ.. అతడు ఆమె ఆధార్ కార్డు (Man Climbs Tree With Wife's Aadhaar Card) కూడా తనతో తీసుకెళ్లాడు. దీంతో ఆమె కూడా కరోనా టీకా వేయించుకోలేకపోయింది. ఇక ఈ ఘటనపై ఖుజ్నర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ.. ఈ విషయం గురించి తెలిసి గ్రామాన్ని సందర్శించి కన్వర్‌లాల్‌కు సలహా ఇచ్చాను. కౌన్సిలింగ్ తర్వాత కన్వర్లాల్ భయం తుడిచిపెట్టుకుపోయింది. మరోసారి గ్రామంలో టీకా శిబిరం జరిగినప్పుడు కన్వర్లాల్, అతని భార్య టీకాలు తీసుకుంటానని తెలిపారు.” అని అన్నారు.
ఇక జూన్ 21న దేశ వ్యాప్తంగా ఒకే రోజులో 84 లక్షలకు పైగా టీకాలను తీసుకున్నారు. అయితే ఆ రోజు మధ్యప్రదేశ్‌లో 16.93 లక్షల టీకాలు వేయడంతో దేశంలో టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో టీకాలు ఎక్కువగా లేవు. జూన్ 20న రాష్ట్రంలో 692 మందికి మాత్రమే టీకాలు వేయగా.. జూన్ 23న 4,842 మందికి టీకాలు ఇచ్చారు.