Vizag LG Polymers Gas Leak: గ్యాస్ లీకయిన వెంటనే రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్ నేవీ బృందాలు, లేకుంటే భారీ ప్రాణ నష్టం జరిగేది, మీడియాతో ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఎస్‌ఎన్ ప్రధాన్
ఈ విషాద ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు (National Disaster Relief Force) రంగంలోకి దిగి గ్యాస్ లీక్ ఘటన ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి బాధితులను ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. 500 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు చెప్పారు. గ్యాస్ లీక్ ప్రమాదంలో (Vizag Gas Leak) ఇప్పటివరకు 11 మంది చనిపోయారన్నారు. 200 మందికి పైగా వైద్యసాయం పొందుతున్నారన్నారు.
Vishakhapatnam, May 7: విశాఖ ఎల్‌జీ పాలీమర్స్ కంపెనీలో గ్యాస్ లీకైన (Vizag LG Polymers Gas Leak) వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఎస్‌ఎన్ ప్రధాన్ (NDRF chief SN Pradhan) తెలిపారు. ఈ విషాద ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు (National Disaster Relief Force) రంగంలోకి దిగి గ్యాస్ లీక్ ఘటన ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించామని తెలిపారు. వైజాగ్ గ్యాస్ లీక్ విషాదం, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం, తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య, ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపిన ఏపీ సీఎం
ఇంటింటికి వెళ్లి బాధితులను ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. 500 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు చెప్పారు. గ్యాస్ లీక్ ప్రమాదంలో (Vizag Gas Leak) ఇప్పటివరకు 11 మంది చనిపోయారన్నారు. 200 మందికి పైగా వైద్యసాయం పొందుతున్నారన్నారు.
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి హానికారక స్టెరీన్ గ్యాస్ విడుదలైన ఘటనపై ఎన్డీఆర్‌ఎఫ్( నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), ఎన్‌డీఎంఏ( నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు తమ బృందాలు అక్కడే ఉంటాయని చెప్పారు. అదే సమయంలో పుణె నుంచి ఎన్టీఆర్‌ఎఫ్ నిపుణుల బృందం వైజాగ్ వస్తోందని ప్రధాన్ చెప్పారు.
Here's ANI Tweet
సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర యంత్రాంగానికి అందుబాటులోకి వచ్చి కనీసం 200 కుటుంబాలను కాపాడామని ఎన్టీఆర్‌ఎఫ్ డైరక్టర్ జనరల్ ప్రధాన్ తెలిపారు. ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు ఇంటింటికీ వెళ్లి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయన్నారు. తమ బృందాలు చేరుకునే సరికి అనేక మంది అపస్మార స్థితిలో ఉన్నారని చెప్పారు. తాము కాపాడిన వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారని ప్రధాన్ తెలిపారు.
Here's Defence PRO Tweet
అటు ఇండియన్ నేవీ కూడా సత్వరమే స్పందించింది. వైజాగ్‌లోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి 5 మల్టీ ఫీడ్ మ్యానిఫోల్స్ ఆక్సిజన్ సెట్‌లను అందించింది. దీంతో ఆక్సిజన్ కొరత లేకుండా బాధితులకు వెంటనే చికిత్స అందించగలిగారు.
Here's ѕαtчα prαdhαn Tweet
జంబో సైజు ఆక్సిజన్ బాటిల్స్‌కు ప్రత్యామ్యాయంగా నేవీ రూపొందించిన సెట్లతో ఒకేసారి ఆరుగురికి ఆక్సిజన్ అందించే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే కోవిడ్ పేషెంట్ల కోసం ఇలాంటి 25 కిట్లు జిల్లా యంత్రాంగానికి నేవీ అందించింది. కింగ్ జార్జ్ ఆస్పత్రిలో బాధితులను ఓదార్చిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఆ వదంతులు నమ్మవద్దన్న డీజీపీ గౌతం సవాంగ్, ఘటనపై స్పందించిన ఎల్‌జీ కెమ్ యాజమాన్యం
ఘటనపై విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ... లీకైన రసాయనం ఎప్పుడూ ద్రవ రూపంలో ఉండాలన్నారు. కాగా సాంకేతిక లోపం వల్లే రసాయనం వాయు రూపంలోకి మారిందన్నారు. రసాయనం ఎప్పుడూ 20 డిగ్రీల ఉష్ణోగ్రతకు లోపే ఉండాలన్నారు. ఉదయం 3.45 నుంచి 5.45 మధ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల ప్రాంతం గ్యాస్ ప్రభావానికి గురైందన్నారు.