Vulgar Dance at Manikarnika Ghat: పవిత్ర గంగా నది ఒడ్డున రికార్డింగ్ డ్యాన్సులు, మణికర్ణిక ఘాట్‌లో మహిళలతో అశ్లీల నృత్యాల ప్రదర్శన కలకలం
మహాశంషాన్ నాధ్ బాబా మూడు రోజుల వార్షిక కార్యక్రమం చివరి రోజున మంగళవారం రాత్రి ఈ ప్రదర్శన నిర్వహించారు. స్మశాన వాటికల్లో మణికర్ణిక ఘాట్‌లో తమ జీవితంలో తుది అంకాన్ని గడపాలని కోరుకుంటారు
యూపీలో వారణాసిలోని (UP) పవిత్ర గంగా నది ఒడ్డున మణికర్ణిక ఘాట్‌లో మహిళలతో అశ్లీల నృత్యాల ప్రదర్శన కలకలం రేపింది. మహాశంషాన్ నాధ్ బాబా మూడు రోజుల వార్షిక కార్యక్రమం చివరి రోజున మంగళవారం రాత్రి ఈ ప్రదర్శన నిర్వహించారు. స్మశాన వాటికల్లో మణికర్ణిక ఘాట్‌లో తమ జీవితంలో తుది అంకాన్ని గడపాలని కోరుకుంటారు.
ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతుంటారు.ఇంతటి పవిత్రత కలిగిన మణికర్ణిక ఘాట్‌లో మహిళలతో అశ్లీల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. డ్యాన్స్ ప్రదర్శనను వీక్షించే వారు మహిళా డ్యాన్సర్లపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. సంప్రదాయం పేరిట అశ్లీల నృత్యాలు చేయడం తగదని పలువురు విమర్శలు గుప్పించారు.
వీడియో ఇదిగో, భారత్ గడ్డపై ఏడు దశాబ్దాల తరువాత నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత
ఇదిలా ఉంటే అశ్లీల నృత్య ప్రదర్శనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్మశానవాటిక నిర్వాహకులు గుల్షన్ కపూర్ పేర్కొన్నారు.