ప్రాజెక్ట్ చీతా (Project cheetah) లో భాగంగా నమీబియా (Namibia) నుంచి గతేడాది భారత్ (India)కు తీసుకొచ్చిన Siyaya చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని కూనో నేషనల్ పార్క్ (Kuno National Park)లో నమీబియా చిరుత (Namibian cheetah)కు నాలుగు పిల్లలు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) ధృవీకరించారు. చిరుత పిల్లల చిత్రాలను, వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.
వణికిస్తున్న భూకంపాలు, అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదు
గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన నమీబియా నుంచి ఎనిమిది చీతాలను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలారు.ఎనిమిదింట్లో ఆడ చీత (female cheetah) సాషా (Sasha) సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యలతో సాషా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
Here's Video
I congratulate the entire team of Project Cheetah for their relentless efforts in bringing back cheetahs to India and for their efforts in correcting an ecological wrong done in the past.
— Bhupender Yadav (@byadavbjp) March 29, 2023
సాషా మృతి చెందిన రెండు రోజుల్లోనే మరో చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ పరిణామంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్ గడ్డపై చీతాలు జన్మించాయి.మనదేశంలోని చివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. ఈ క్రమంలో దేశంలో చిరుతలు పూర్తిగా అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం 1952లో అధికారికంగా ప్రకటించింది.