Himachal Pradesh Tragedy: ఘోర విషాదం..విరిగిపడిన కొండ చరియలు, తొమ్మిది మంది మృతి, నలుగురికి తీవ్ర గాయాలు, కూలిన బాట్సేరి వంతెన, హిమాచల్‌ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయ వద్ద ప్రమాదం

కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడి (Terrifying Rockslide Caught On Tape) జనావాసాల మీదకు రావడంతో 9 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Terrifying Rockslide Caught On Tape In Himachal Pradesh Leaves 9 Dead (Photo-Video Grab)

Kinnaur, July 25: హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయ వద్ద ఘోర ప్రమాదం (Himachal Pradesh Tragedy) చోటు చేసుకుంది. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడి (Terrifying Rockslide Caught On Tape) జనావాసాల మీదకు రావడంతో 9 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వేగంగా దూసుకువచ్చిన బండరాళ్ల ధాటికి సమీపంలో ఉన్న బాట్సేరి వంతెన కూలిపోయింది. అంతేకాకుండా దగ్గరలో ఉన్న వాహనాలు, విశ్రాంతి​ గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక దృశ్యాలు ఏర్పడ్డాయి. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో జరిగింది. కాగా గత వారం భారీగా కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడ్డాయని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ప్రమాదాలకు గురయ్యే పలు ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకొని క్షతగాత్రులకు వైద్య సహయాన్ని అందిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ అబిద్‌ హూస్సేన్‌ పేర్కొన్నారు.

మళ్లీ కేరళలో కరోనా ప్రమాద ఘంటికలు, పుట్టుకొస్తున్న కొత్త వెరియంట్లతో బూస్టర్‌ డోస్‌ తప్పదంటున్న ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా, దేశంలో తాజాగా 39,472 మందికి కోవిడ్

హిమాచల్ ప్రదేశ్ లో (Himachal Pradesh) ఆకస్మిక వరదలు సంభవించిన కొద్ది రోజుల తరువాత ఈ సంఘటన జరిగింది. గత వారం భారీ వర్షపాతం కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 13 కు చేరింది. సిమ్లా నుండి 245 కిలోమీటర్ల దూరంలో హిమాచల్ లోని కిన్నౌర్ జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చిట్కుల్ కు వెళుతున్న పర్యాటక వాహనాంపై రాళ్లు ఒక్కసారిగా పడ్డాయి.

‘బండరాళ్లు విరిగిపడిన సమయంలో 11 మందితో ఉన్న టూరిస్ట్ వాహనంలో ఆ సమీపంలోనే ఉన్నారు’’ అని కిన్నౌర్ ఎస్‌పీ సాజు రామ్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి కారణాలేంటో తెలుసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూనే గాయపడ్డ వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు జైరా ఠాకూర్ పేర్కొన్నారు.

Here's Video

గత వారం రాష్ట్రంలో రుతుపవనాల రాకతో భారీ వర్షాలు పడ్డాయి ఈ నేఫథ్యంలో పర్యాటకులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడికీ వెళ్ళవద్దని స్థానిక అధికారులు సూచించినట్లు సమాచారం. అయితే కొంతమంది పర్యాటకులు పోలీసులను తప్పించుకుని సంగ్లాకు చెందిన చిట్కుల్ వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిట్కుల్, బస్పా నది కుడి ఒడ్డున ఉన్న గ్రామం, బాస్పా లోయ యొక్క చివరి గ్రామం. పాత హిందూస్తాన్-టిబెట్ వాణిజ్య మార్గంలో చివరి గ్రామం. భారతదేశంలో పర్మిట్ లేకుండా ప్రయాణించగల చివరి పాయింట్ ఇదే.

కరోనా థర్డ్ వేవ్‌పై గులేరియా కీలక వ్యాఖ్యలు, భారతీయుల్లో రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉందని సెరోస‌ర్వేను ఉటంకిస్తూ ఎయిమ్స్ చీఫ్ డాక్ట‌ర్ వెల్లడి

పోలీసులు విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మరణించారు. శనివారం పోలీస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుండు పర్యాటకులు ప్రమాదకర పర్వత లోయలకు, నదులకు దగ్గరగా ఉన్న గమ్యస్థానాలకు ప్రయాణించకుండా ఉండాలని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.